కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy Temple)లో కరోనా కేసులు కలకలం రేపాయి. అంతర్వేది ఆలయం (Antarvedi Temple)లో సేవలు అందించే నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో అంతర్వేది దేవాలయంలో దర్శనాలు రద్దు చేశారు.



 


కరోనా కేసుల కేసుల నేపథ్యంలో నేడు ఆలయాన్ని మూసేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ ప్రకటించారు. అయితే ఆలయంలో కరోనా కేసులు రావడం ఇది రెండోసారి. కేశఖండనశాల సిబ్బందికి కొవిడ్‌19 పాజిటివ్‌గా తేలడంతో ఇటీవల ఆ సేవలను తాత్కాలికంగా రద్దు చేయడం తెలిసిందే. మిగతా ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆలయ పరిసరాలను శానిటేషన్ చేశారు. 


Also Read: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్


 


కాగా, కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో అంతర్వేది ఆలయంలో రథాన్ని తగలబెట్టడం వివాదానికి దారి తీసింది. దీనిపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆపై కొత్త రథాన్ని రూపొందించే పనులు చేపట్టి కొనసాగిస్తున్నారు. ఆలయాలు తెరుచుకున్న తర్వాత భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe