COVID-19 Effect On Temples In AP: కరోనా వైరస్ సెకండ్ వేవ్ తొలి దశ కన్నా చాలా రెట్లు ప్రమాదకరంగా మారుతోంది. గత ఏడాది ఒక్కరోజు కూడా లక్ష కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన దాఖలాలు కానీ ప్రస్తుతం ఏప్రిల్ నెలలో దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నేడు ఏకంగా 3 లక్షలకు పైగా మంది కోవిడ్19 బారిన పడ్డారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు. కనుక కోవిడ్19 వ్యాప్తి అరికట్టేందుకు ఆలయాల అధికారులు, సిబ్బంది చర్చి దర్శన వేళలు, కోవిడ్ నిబంధనలలో మార్పులు చేర్పులు చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకంలో దర్శన వేళలు కుదించారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారి దర్శన వేళల్లో మార్పు చేశామని, మాస్క్‌లు లేని భక్తులను దర్శనానికి అనుమతించడం లేదని ఆలయ అధికారులు తెలిపారు.


Also Read: Oxygen Supply: కరోనా ఉధృతి దృష్ట్యా ఆక్సిజన్ లభ్యతపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం


తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో అధికారులు కరోనా ఆంక్షలు విధించారు. నేటి నుంచి పదేళ్ల చిన్నారులు, 60 ఏళ్ళు దాటిన వృద్దులకు దర్శనాలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సత్యదేవుని అంతరాలయంలో దర్శనాలు సైతం తాత్కాలికంగా నిలిపివేశారు.  


చిత్తూరు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నిన్న 21,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 11,006 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.18 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో కరోనా నియంత్రణపై నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కరోనా కట్టడి, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్‌పై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.


Also Read: Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook