Oxygen Supply: కరోనా వైరస్ మహమ్మారి పెనురక్కసిలా విరుచుకుపడుతోంది. రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా ఇబ్బందిగా మారడంతో ఏపీ ప్రభుత్వం తక్షణం ఆక్సిజన్ లభ్యతపై దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) విసురుతున్న పంజా గట్టిగా తగులుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2 లక్షల 95 వేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 9 వేల 5 వందల పై చిలుకు (Ap Coronavirus cases)కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ( Oxygen shortage) ఏర్పడింది. పరిశ్రమల కంటే ఆరోగ్యరంగానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చి చేరుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది.
ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం (Ap government) ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్ పీక్‌స్టేజ్‌లో ఉంటే రోజుకు 2 వందల టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగతా సమయంలో రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమని తెలిపారు. ఈ మేరకు ఆక్సిజన్‌ను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది ప్రణాళిక రచించారు విశాఖ స్టీల్‌ప్లాంట్(Visakha steelplant), భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ రాష్ట్రానికి వచ్చేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది ప్రభుత్వం. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా(Oxygen Supply) ప్రారంభించగా..బళ్లారి, చెన్నైల నుంచి మరింతగా ఆక్సిజన్ తెచ్చుకునేలా కసరత్తు చేస్తున్నారు అదికారులు. ఆక్సిజన్ నిల్వలు సిద్దం చేసుకునేలా ఇప్పట్నించే ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
Also read: Remdesivir Demand: విశాఖపట్నం అడ్డాగా రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ దందా, ముంబైలోనూ అదే జోరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook