Horoscope Today March 9 2022: మేషం ( Aries): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విద్యా రంగంలోని వారికి శుభకాలం. ఒక వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ఈశ్వర ఆరాధన మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): ప్రోత్సాహకర వాతావరణం నడుస్తోంది. ప్రారంభించిన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదివితే బాగుంటుంది.


మిథునం (Gemini): పూర్తిగా మిశ్రమకాలం అందిస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మీ మాటలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచిది.


కర్కాటకం (Cancer): పనుల్లో ఓర్పు అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.


సింహం (Leo): అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదైవ స్తోత్రాన్నిచదవడం మంచిది.


కన్య (Virgo): మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవారాధన శుభాన్ని కలిగిస్తుంది.


తుల (Libra): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంతో హాయిగా గడుపుతారు. చంద్ర శ్లోకం చదవడం మంచిది


వృశ్చికం (Scorpio): అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటలను జవదాటకూడదు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది


ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. అధిక ధనవ్యయం తప్పదు. శని శ్లోకం చదవాలి.


మకరం (Capricorn): ప్రారంభించిన పనులను సమయానికి పూర్తి చేస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ బుద్దిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.


కుంభం  (Aquarius): మీమీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. వివరాలకు దూరంగా ఉండాలి. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. శని జపం అనుకూలత ఇస్తుంది.


మీనం (Pisces): ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్దిస్తుంది. విందు, వినోదాలతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణ సూచన ఉంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.


Also Read: Megastar Chiranjeevi: చిరు-బాబీ మూవీ అప్ డేట్... మెగాస్టార్ కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?


Also Read: Viral Video: ఏనుగును పరుగులు పెట్టించిన అడవి దున్న, ఫన్నీ వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook