Sri Rama Navami 2024: శ్రీరామనవమిరోజు ఈ శక్తివంతమైన మంత్రం పఠిస్తే మీ ఇంట సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..
Sri Rama Navami 2024: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 బుధవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. నేపథ్యంలో శ్రీరామ నవమిరోజు పఠించాల్సిన మంత్రం గురించి తెలుసుకుందాం.
Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు అభిజిత్ ముహూర్తం కర్కాటక లగ్నంలో త్రేతాయుగంలో రాముడు పుట్టాటని నమ్ముతారు. ఆయనది ఒకే మాట ఒకే బాట ఒకే భార్య. ఎంతో అద్భుతమైన రాజ్య పరిపాలన తీరు ఉండేదట. ఆ కాలం వానలు కూడా సరైన సమయానికి కురిసేవి. అంటే నెలకు మూడు వర్షాలు కురిసేవట దీంతో పంట పొలాలు కూడా పచ్చగా ఉండేవి. దేవుడు మానవుని రూపం ఎత్తాడని నమ్మేవారు. సూర్యవంశానికి చెందిన శ్రీరాముని సీతమ్మతో పెళ్లి కూడా ఈరోజునే జరిగిందని నమ్ముతారు. ముఖ్యంగా శ్రీరాముడు పుట్టిన సమయంలో సూర్యడు కూడా అత్యంత శక్తివంతంగా ఉండేవాడట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరాముడు పుట్టాడు. అప్పుడు సూర్యుడు మరింత బలంగా ఉంటాడు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 బుధవారం జరగునుంది.
శ్రీరామ మంత్రాలు పఠిస్తే సంపద ఐశ్వర్యం మీసొంతం..
ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ
శ్రీ రామ జయ రామ కోదండ రామ..
ఈ శ్రీరాముని మంత్రంతో ఆందోళన తొలగిపోతుంది.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్యే
రఘునాథాయ నాదాయ సీతాయ పథాయే నమః
ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధేమహి, తనో రామ ప్రచోదయత్
ఈ రామ గాయత్రి మంత్రం సీతాదేవికి అంకితం చేశారు. ఈ మంత్రం మేధస్సుకు సంబంధించింది.
ఇదీ చదవండి: రామయ్య కల్యాణానికి 'కోడ్' అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణ
హీన రామ్ హీన రామ్..
ఇది కూడా శ్రీరాముని శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం ఆధ్యాత్మిక అవగాహనను పెంచుతుంది.
రామాయ నమః..
ఈ మంత్రం పఠించినవారిలో ఏకాగ్రత్త పెరుగుతుంది. చెడు ఆలోచనలను తొలగిస్తుంది.
శ్రీరామ శరణం మామ..
ఈ మంత్రాన్ని పఠించిన వారికి మానసిక, శారీరక స్థైర్యం లభిస్తుంది.
ఇదీ చదవండి: మంచి భర్త సహా అన్నింట్లో ఆదర్శం శ్రీ రామచంద్రుడు.. ఏ విధంగా అంటే..
శ్రీరామ చంద్రాయ నమః..
మానసిక చింతనల నుంచి బయటపడేస్తుంది.
శ్రీరామనవమి సందర్భంగా ఈ మంత్రాన్ని పఠించిన వారి కోర్కెలు తీరుస్తాడు శ్రీరాముడు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter