Vinayaka Chavithi 2022: దేశవ్యాప్తంగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితిని (Vinayaka Chavithi 2022) ఈ రోజు అంటే ఆగస్టు 31, బుధవారం నాడు జరుపుకోనున్నారు.  ఈ రోజున బొజ్జ గణపయ్య ప్రతి ఇంట్లో కొలువుదీరుతారు. ఇవాళ ఇంటి పూజగదిలో వినాయక ప్రతిమను ప్రతిష్టించి పూజ చేస్తారు. ఈ ఆరాధనలో గణపతికి లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, కుడుములు వంటి పదార్ధాలు నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా ప్రతి వీధిలో గణేశుడు విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వినాయకుడిని ఏకవింశతి పత్ర అంటే 21 రకాల పత్రాలతో పూజిస్తారు. ఈ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 రకాల ఆకులు ఇవే...


మాచీ పత్రం: దీనిని మాచ పత్రి అంటారు. ఇది కుష్టువ్యాధికి మంచి మందుగా పనిచేస్తుంది. తలనొప్పి, చర్మ వ్యాధులు, కండరాల నొప్పులతో బాధపడేవారు దీనిని వాడితే ఉపశమనం లభిస్తుంది. 
బృహతీ పత్రం: దీనిని వాకుడాకు, ములక అని కూడా పిలుస్తారు. క్షయ, ఉబ్బసపు దగ్గు, తాపములను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించగలదు. వీర్యవృద్ధిని కలిగిస్తుంది. 
బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు లేదా బిలిబిత్తిరి అని పిలుస్తారు. బిల్వ పత్రం త్రిదళం. ఇది శివుడికి ఎంతో ఇష్టమైనది. డయాబెటిస్‌, డయేరియా, గ్యాస్టిక్‌ సమస్యలను తగ్గిస్తుంది. 
దూర్వా పత్రం: దీనినే గరిక అని కూడా అంటారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గాయాలు, అలర్జీ సమస్యలను నివారించే గుణం వీటికి ఉంది. 
దుత్తూర పత్రం: దీనిని ఉమ్మెత్త ఆకు అంటారు. ఇందుల్లో నల్ల ఉమ్మెత్త శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. కాలిన చర్మానికి, బొబ్బలు, లైంగికరపరమైన వ్యాధులకు ఈ ఆకు బాగా పని చేస్తుంది.
బదరీ పత్రం: దీనిని రేగు ఆకు అంటారు. జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును అరికడతాయి. అంతేకాకుండా ఈ ఆకుల నురుగురాస్తే అరికాళ్ల మంటలు, అరిచేతుల మంటలు తగ్గుతాయి. 
అపామార్గ పత్రం: దీనిని ఉత్తరేణి ఆకు అంటారు. ఇది పంటి జబ్బులను తగ్గిస్తుంది. దీనిని శివునికి ఇష్టమైన ఆకుగా పేర్కొంటారు. 
తులసీ పత్రం: హిందువులకు తులసి మెుక్కను పవిత్రంగా భావిస్తారు. ఇది వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి,  కడుపు నొప్పికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. 
చూత పత్రం: దీనిని మామిడి ఆకు అంటారు. దీనిని తోరణాలుగా ఉపయోగిస్తారు. మూత్రాశయ మంటలు, అతిసారాన్ని తగ్గిస్తుంది. 
కరవీర పత్రం: దీనినే గన్నేరు ఆకు అంటారు. ఇది క్యాన్సర్‌, ఆస్తమా నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. 
విష్ణుక్రాంత పత్రం: గడ్డి నేలలపైకి పాకుతూ విస్తారంగా పెరిగే మెుక్క ఇది. దీని కషాయం పైత్య జ్వరాలకు, కఫ జ్వరాలకు, ఉబ్బులను తగ్గుస్తుంది. 
దాడిమీ పత్రం: ఇది దానిమ్మ ఆకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నీళ్ల విరోచనాలు, నోటిపూతను తగ్గిస్తుంది. 
దేవదారు పత్రం: దేవతలకు ఎంతో ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఇది అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది.
మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని స్త్రీలు తలలో ముడుచుకుంటారు. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 
సింధువార పత్రం: దీనినే వావిలాకు అని కూడా పిలుస్తుంటారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. 
అర్క పత్రం: దీనినే జిల్లెడు అంటారు. ఇది పాము, తేలు విషాలను హరిస్తుంది. మూర్ఛ, పక్షపాతాన్ని పోగొడుతుంది. 
జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. దీనిని వాతానికి, పైత్యానికి మందుగా ఉపయోగిస్తారు. నోటి పూతను, నోటి దుర్వాసను పోగొడుతుంది. 
గండకీ పత్రం: దీనిని వినాయక పత్రం అని కూడా అంటారు. సీతాకోక చిలుక మాదిరి దీని ఆకులు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
శమీ పత్రం: దీనినే జమ్మి ఆకు అంటారు. పైల్స్‌, కుష్ఠు నివారణకు, దంత సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. ఆలయాల్లో ఈ చెట్టును పూజిస్తారు. జ్వరాలకు, నోటి పూతకు మందుగా పనిచేస్తుంది. దీనిని ఆస్తమా నివారణకు వాడతారు. 
అర్జున పత్రం: దీనినే మద్దిచెట్టు ఆకు అంటారు. కీళ్ల నొప్పులకు, గాయాలకు, వ్రణాలు తగ్గడానికి ఈ పత్రం పనిచేస్తుంది. 


Also Read: Ganesh Chaturthi 2022: వినాయకుడి పుట్టుక వెనుకున్న ఆసక్తికర కథ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook