Mars Transit 2023 Effects On Zodiac Signs: జులై 1వ తేదీన అంగారకుడు సింహ రాశిలోకి సంచారం చేశాడు. ఇదే రాశిలో 49 రోజులపాటు ఉండబోతున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభ స్థానంలో జరిగితే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల స్థానంలో జరిగింది. దీంతో ఈ సంచారం కారణంగా 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం శుభస్థానంలో జరిగిన రాశుల వారికి అదృష్టం రెట్టింపవడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఏయే రాశుల వారిపై అంగారకుడు ప్రభావం చూపబోతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై అంగారకుడి ప్రభావం:
మిథునరాశి:

మిథునరాశి వారికి అంగారకుడి సంచారం ప్రభావం కారణంగా ఆర్థికంగా లోటుండదని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అంతే కాకుండా వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉండవచ్చునని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇక తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడే వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంచారం కారణంగా వీరి భవిష్యత్తుపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. 


సింహ రాశి:
సింహరాశిలోకి అంగారకుడు చేసే సంచారం ఈ రాశి వారికి చాలా శుభ్రంగా ఉండవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి ఈ సంచారం మరింత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు మంచి ప్యాకేజీలతో జాబ్ పొందడమే కాకుండా..ఇప్పటికే చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో



తులారాశి:
అంగారకుడి సంచారం తులా రాశికి 11వ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా ఆకస్మిక లాభాలు పొందడమే కాకుండా విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సొంత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారు విపరీతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తులా రాశి వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కార్యాలయాల్లో మీ పని పట్ల ప్రశంసలు కూడా పొందవచ్చు.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook