COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lucky Zodiac Signs: డిసెంబర్ 27వ తేదీన కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. కుజుడు వృశ్చిక రాశి నుంచి త్వరలోనే ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ అంగారక గ్రహం సంచారం చేయడం కారణంగా ఈ సార్లు ప్రత్యేక యోగాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కుజ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాన్ని శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యానికి సూచికగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుజుడు మేష, వృశ్చిక రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
కుజుడు సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అంతేగాకుండా చాలా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయంలో ఊహించని విజయాలు పొందుతారు. కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరు ఆర్థిక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవంతో పాటు అధికారుల సపోర్టు లభిస్తుంది. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు పొందలేని శుభవార్తలు కూడా అందుకుంటారు.


మిథున రాశి:
ఈ సంచార ప్రభావం మిథున రాశి వారిపై కూడా ప్రత్యక్షంగా పడబోతోంది దీని కారణంగా పాత స్నేహితులు కలుసుకోగలుగుతారు ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మంచి లాభాలు పంపుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.  ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతులు కూడా పొందుతారు. ఇక విద్యార్థుల విషయానికొస్తే క్రీడల్లో గొప్ప విజయం సాధిస్తారు. దీంతోపాటు వీరు ఇంతకుముందు ఎప్పుడూ పొందలేని ఆర్థిక లాభాలు కూడా. 


సింహరాశి:
సింహ రాశి వారు ఈ సంచారం కారణంగా మంచి లాభాలు పొందుతారు. ఇంతకుముందు పెండింగ్లో ఉన్న డబ్బులు ఈ సమయంలో తిరిగి పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రణాళికల్లో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి కూడా సపోర్టుగా ఉంటుంది. దీంతోపాటు వీరు పాత స్నేహితులను కూడా కలిసి ఛాన్స్ ఉంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి