Shukra And Shani Margi: శుక్ర, శని గ్రహాల ప్రభావంతో ఈ రాశుల వారి జీవితాల్లో మరోసారి లాభాలు కలగబోతున్నాయి..
Shukra Gochar and Shani Margi 2023 November: శుక్ర, శని గ్రహాలు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Shukra Gochar and Shani Margi 2023 November: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్ర, శని గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని గ్రహాన్ని కర్మఫలం దాతగా.. శుక్ర గ్రహాన్ని విలసం, ఆనందం, సుఖానికి సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒకేసారి సంచారం చేయడం కారణంగా కొందరు వ్యక్తిగత జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శుక్ర శని గ్రహాలు వ్యక్తుల జాతకాల్లో అనుకూల స్థానాల్లో సంచారం చేస్తే డబ్బుకు అదృష్టానికి ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే ఈ రెండు గ్రహాలు ప్రతికూల స్థానాల్లో సంచారం చేస్తే మానసిక, శరీరక సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 12వ తేదీన జరగబోతోంది. అయితే దీపావళికి ముందు నవంబర్ 3వ తేదీన శుక్ర గ్రహం సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. నవంబర్ 4వ తేదీన కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేయబోతోంది. ఈ రెండు సంచారాల కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రెండు గ్రహాల సంచారం కారణంగా వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి.
మేషరాశి:
మేష రాశి వారికి నవంబర్ నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టపడి పనులు చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ నవంబర్ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కోర్టు సంబంధిత అంశాల్లో కూడా ఈ సమయంలో క్లారిటీ వస్తుంది.
మకర రాశి:
మకర రాశి వారికి నవంబర్ నెల జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. దీపావళికి ముందు జరిగే ఈ రెండు సంచారాల కారణంగా ఆర్థికంగా కూడా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. ఇక విద్యార్థులైతే ఈ సమయంలో అనేక రకాల లాభాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.