Falgun Amavasya 2023 Date, Benefits: ప్రతి నెలలో కృష్ణ పక్షం చివరి తేదీని అమావాస్య అంటారు. హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం మరియు ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల శుభఫలితాలను పొందుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2023 సంవత్సరం ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 20, సోమవారం వస్తుంది. సోమవారం నాడు ఫాల్గుణ అమావాస్య (Falgun Amavasya 2023) రావడం వల్ల దీనిని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం మరియు అదృష్టం కోసం  ఈ అమావాస్యను పాటిస్తారు. అంతేకాకుండా ఈరోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం మరియు శ్రాద్ధం కూడా చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫాల్గుణ అమావాస్య 2023 తేదీ
హిందూ పంచాగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య ఫిబ్రవరి 19, ఆదివారం సాయంత్రం 04:18 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 20, 2023న మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. అందుకే 2023 ఫిబ్రవరి 20న ఫాల్గుణ అమావాస్య జరుపుకుంటారు.


ఫాల్గుణ అమావాస్య 2023 ముహూర్తం
సూర్యోదయం: ఉదయం 06 : 56
సూర్యాస్తమయం: సాయంత్రం 06 : 15
చంద్రోదయం: ఉదయం 07 : 07
చంద్రాస్తమయం: సాయంత్రం 06 : 24
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12: 12 నుండి 12: 58 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12: 58 నుండి 01:43 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 03 : 13 నుండి 03:59 వరకు
అమృత కాలం : తెల్లవారుజామున 02 : 38 నుండి 04 : 03 (ఫిబ్రవరి 21)
రాహు కాలం: ఉదయం 08: 20 నుండి 09: 45 వరకు


ఫాల్గుణ అమావాస్య ప్రాముఖ్యత
ఫాల్గుణ అమావాస్య రోజున దేవతలు పవిత్ర నదులలో దర్శనమిస్తారు. అందుకే ఈ రోజున నదీస్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున స్నానం చేసి దానధర్మాలు చేయాలి. ఈ రోజు ఉపవాసం మరియు పూజలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అదే విధంగా పూర్వీకుల శాంతి కోసం దానాలు, తర్పణం, శ్రాద్ధం మొదలైనవి చేయడం వల్ల వారి అనుగ్రహం మీకు లభిస్తుంది.


Also Read: Safala Ekadashi 2022: ఇవాళే సఫల ఏకాదశి, మూడు అరుదైన యోగాలు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook