These Feng Shui tips brings Huge Money yours house: 'ఫెంగ్ షుయ్'.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫెంగ్ షుయ్ ఓ చైనీస్ వాస్తు శాస్త్రం (చైనీస్ ఆర్కిటెక్చరల్ సైన్స్). ఇందులో ఫర్నిచర్‌కి సంబంధించిన కొన్ని పరిహారాలు ఉంటాయి. వీటిలో ఇల్లు, ఆఫీస్ ఫర్నిచర్‌కు సంబంధించి పరిహార చర్యలు ఉన్నాయి. ఫెంగ్ షుయ్ చిట్కాలను పాటిస్తే.. జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, అదృష్టం, విజయం లభిస్తాయి. ఫెంగ్ షుయ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనీస్ వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ తగ్గి.. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఫెంగ్ షుయ్ అంశాలు అనేక రకాల వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. దాంతో ఇంట్లో డబ్బుతో పాటు ఆనందం కూడా వెల్లువిరుస్తుంది. ఈ రోజు మనం కొన్ని పవర్‌ఫుట్ ఫెంగ్ షుయ్ వస్తువుల గురించి తెలుసుకుందాం.  


మెటల్ తాబేలు: మెటల్ తాబేలు చాలా శుభప్రదమైనది. మెటల్ తాబేలును ఇంటికి ఉత్తరం వైపుగా ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అద్భుత విజయాలు ఉంటాయి. ధన లాభం ఉంటుంది. 


ఒంటె: ఇంట్లో ఒక జత ఒంటె బొమ్మలను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. వీటిని ఇంటి వాయువ్య దిశలో ఉంచాలి. వాయువ్య దిశలో కాకుండా.. మరే ఇతర దిశలో ఉంచినా ఫలితం ఉండదు. కేవలం ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా ఒంటె బొమ్మలను ఉంచుకోవచ్చు. ఒంటెను ఇంట్లో, ఆఫీసులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


పిల్లి: ఫెంగ్ షుయ్‌లో పిల్లి కూడా చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే.. ఇంట్లో, ఆఫీస్  లేదా దుకాణంలో ఉత్తర దిశలో పసుపు రంగు పిల్లి బొమ్మను పెట్టండి. నూతనంగా చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే.. ఈశాన్యంలో ఆకుపచ్చ పిల్లిని ఉంచండి. ప్రేమలో విజయం సాదించాలనుకునే వారు నైరుతిలో ఎరుపు రంగు పిల్లిని ఉంచాలి. 


Also Read: Telangana SSC Results: ఏపీలో తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత.. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ! రిలీజ్ ఎప్పుడంటే...


Also Read: Heart Attack: వేప ఆకుతో గుండె సమస్యలకు చెక్‌..ఈ ఆకుల వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook