Horoscope Today August 31st 2022: ఇవాళ బుధవారం. హిందువులు శ్రీకృష్ణ పరమాత్ముడిని కొలిచే రోజు. ఇవాళే గణేశ్ చతుర్థి కూడా కావడం విశేషం. ఆ గణనాథుడు నేటి నుంచి 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు. నిష్టగా, భక్తి భావంతో ఎవరైతే ఆ గణనాథుడిని పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. వినాయక చవితి సందర్భంగా ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


చంద్రుడి అనుగ్రహం పొందుతారు. ఇవాళ్టితో మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. మీకు ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పిల్లలు, జీవితభాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. సంతోషంగా గణేశ్ చతుర్థి పండగ జరుపుకుంటారు. ఇంటికి తోబుట్టువులు లేదా అమ్మా నాన్నలు వస్తారు.


వృషభ రాశి (Taurus)


టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. మనశ్శాంతి చేకూరుతుంది. ఉద్యోగ,వ్యాపారాల్లో వచ్చిన అవకాశాన్ని మరో ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారు. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఏదో ఒక రూపంలో తగిన ఫలితం పొందుతారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం పొందుతారు. ప్రేమికులు సంతోషకరంగా గడుపుతారు. ఉద్యోగ అన్వేషణ ఓ కొలిక్కి వస్తుంది.


మిథున రాశి (GEMINI)


ఇవాళ నిరాశజనకంగా గడుస్తుంది. బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమవుతారు. కమిట్‌మెంట్స్‌ పూర్తి చేయడం ఆలస్యమవుతుంది. అది మీ గౌరవ మర్యాదకు భంగం కలిగిస్తుంది. వృత్తి జీవితం, కుటుంబ జీవితం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. క్రియేటివ్ పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ చాలా ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్యం పట్ల మీ ఫోకస్ మునుపటికన్నా ఎక్కువగా ఉంటుంది. టార్గెట్స్‌ను సులువుగా అచీవ్ చేస్తారు. వర్క్ రీత్యా ఎక్కడికైనా షార్ట్ ట్రిప్ వెళ్లాల్సి వస్తుంది. పండగ పూట పని భారం కొంత అసంతృప్తికి గురిచేస్తుంది. ఆఫీసులో అందరి సహాయ సహకారాలు పొందుతారు.


సింహ రాశి (LEO)


చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంటారు. మీ సోషల్ సర్వీస్‌కి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఒక శుభవార్త కుటుంబం మొత్తాన్ని సంతోషానికి గురిచేస్తుంది. పండగ పూట పిండి వంటలతో అంతా కలిసి విందు భోజనం చేస్తారు. ఇవాళ ఏ పనిచేపట్టినా మీకు సానుకూలత చేకూరుతుంది.


కన్య రాశి (Virgo)


మంచి కర్మ మీకు మంచే చేస్తుంది. మీ అంతరంగాన్ని ఎక్కువగా ఫాలో అవుతారు. అది మీకు కలిసొస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనులు మీకు ప్రతిష్ఠను తీసుకొస్తాయి. ఆర్థికంగా అంతా బాగుంటుంది. పండగ వాతావరణం ఇంట్లో కోలాహలం నింపుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి సమీపంలోని ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంది.


తులా రాశి (Libra)


ఇవాళ మీలో అసంతృప్తి, నిరాశ ఉంటుంది. మీ అహంకారాన్ని వదులుకుంటే అన్నివిధాలా మంచిది. కటువుగా మాట్లాడితే బంధాలు దూరమవుతాయి. మాట తీరుతో మీకు మీరే చేటు చేసుకోవద్దు. లాంగ్ డ్రైవింగ్‌కి వెళ్లే ప్లాన్ ఉంటే మానుకోండి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు ప్రయాణం ఇప్పుడంత మంచిది కాదు. అది మీకు కలిసిరాదు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.


వృశ్చిక రాశి (Scorpio)


మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సంపాదన పెరుగుతుంది. చేతిలో డబ్బు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయవద్దు. మీ నుంచి డబ్బు ఆశించేవారి సంఖ్య పెరుగుతుంది. సింగిల్స్‌కి తగిన జోడీ దొరికే అవకాశం ఉంది. వృత్తి రీత్యా కొత్త అవకాశాలు పొందుతారు. దూరమైన బంధువులు, స్నేహితులు మళ్లీ దగ్గరవుతారు. మీ ఎదుగుదల అందరిలో సంతోషం నింపుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొత్త డీల్స్ పొందుతారు. తద్వారా భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ఉద్యోగస్తులైతే..  మీ కష్టాన్ని మీ బాస్ గుర్తిస్తారు. ప్రశంసలే కాదు ప్రమోషన్ దక్కవచ్చు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ టెన్షన్ పడవద్దు. 


మకర రాశి (Capricorn) 


గందరగోళ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. గతంలో వాయిదాపడిన పనులను మళ్లీ మొదలుపెడుతారు. చకచకా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా కలిసొస్తుంది. అనుకోని డీల్స్ పొందుతారు. భారీ ఒప్పందాలు మీ బిజినెస్ విస్తరణకు దోహదపడుతాయి. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పండగ పూట ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.


కుంభ రాశి (Aquarius)


ఇవాళ మీ ఆరోగ్యం బాగోదు. పాత అనారోగ్యం మళ్లీ తిరగబెడుతుంది. అది వ్యక్తిగత, వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు లేదా సందర్భాలు ఎదురవుతాయి. ఓపికగా డీల్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఊహా ప్రపంచాన్ని వీడితే మంచి ఫలితాలు పొందుతారు.


మీన రాశి (Pisces) 


వృత్తిరీత్యా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. బిజినెస్‌లో కొత్త అవకాశాలు పొందుతారు. మీ పార్ట్‌నర్ సాయంతో బిజినెస్‌లో కొత్త ఆవిష్కరణలకు తెరదీసే అవకాశం ఉంది. అది మీ వ్యాపారాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుంది. చంద్ర అనుగ్రహంతో పాజిటివిటీ చేకూరుతుంది. ఉద్యోగ రీత్యా మీపై ఉన్న అంచనాలకు మించి రాణిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?


Also Read: Nag vs Mahesh babu: మహేష్ బాబుకి నాగ్ ఫాన్స్ లెఫ్ట్ అండ్ రైట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook