WednesDay Ganesh Puja: బుధవారం గణపతిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వసిస్తారు. గణపతిని క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇంట్లో సుఖ, శాంతులు వెల్లివిరుస్తాయి. గణపతి అనుగ్రహం పొందాలంటే గణపతి పూజ సందర్భంగా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గణపతికి 'గరిక గడ్డి' అంటే అమితమైన ఇష్టమని చెబుతారు. అందుకే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి గరిక గడ్డి సమర్పిస్తారు. జంట గరికపోచలతో గణేశుడిని 21 సార్లు పూజిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. సంస్కృతంలో గరికను దూర్వలం అంటారు. అందుకే ఈ పూజను దూర్వా గణపతి పూజ అని కూడా పిలుస్తారు.


జమ్మి చెట్టు ఆకులను బుధవారం నాడు వినాయకుడికి సమర్పిస్తే అనంతమైన పుణ్యాన్ని పొంది గణపతి అనుగ్రహాన్ని పొందుతారని చెబుతారు. ఈ పూజతో భక్తులు తాము చేపట్టిన అన్ని పనుల్లోనూ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. గణేశుడి అనుగ్రహం వారిపై ఎల్లవేళలా ఉంటుంది.


గణపతికి అక్షత సమర్పించండి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్షత లేకుండా గణేశ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో అక్షతను ఉపయోగించినప్పుడు గణేశుడు చాలా సంతోషిస్తాడు. కష్ట కాలంలో గణేశుడి చల్లని చూపు వారిపై ఉంటుంది. గణేశుడి అనుగ్రహం కోసం బుధవారం నాడు పూజలో అక్షత సమర్పిస్తే మంచిది.


ఇవి నైవేద్యంగా సమర్పిస్తే.. :


గణేశుడికి లడ్డూలంటే అమితమైన ఇష్టం. కాబట్టి గణేశ్ పూజలో లడ్డూలు సమర్పిస్తే గణేశుడు చాలా సంతోషిస్తాడు. భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. వారి కష్ట, సుఖాల్లో చల్లని చూపు కనబరుస్తాడు. చేపట్టిన ప్రతీ పనిలో విజయం చేకూరేలా గణేశుడి దీవెనలు ఉంటాయి. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: KGH Ambulance Mafia: విశాఖలోని కేజీహెచ్ లో దారుణం.. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వద్దన్నందుకు బాలింత భర్తపై దాడి!


Also Read: Horoscope Today April 27 2022: రాశి ఫలాలు.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ రాశి వారికి గుడ్ న్యూస్ అందుతుంది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook