KGH Ambulance Mafia: విశాఖలోని కేజీహెచ్ లో దారుణం.. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వద్దన్నందుకు బాలింత భర్తపై దాడి!

KGH Ambulance Mafia: తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఘటన మరువక ముందే ఇప్పుడు వైజాగ్ లో మరో అవమానీయ ఘటన జరిగింది. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతను తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లోనే ఇంటికి తీసుకెళ్తామని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టారు. కానీ, తమకు స్వంత వాహనం ఉందని బాధితులు చెప్పినా వినకుండా.. బాలింత భర్తపై దాడి చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 01:04 PM IST
KGH Ambulance Mafia: విశాఖలోని కేజీహెచ్ లో దారుణం.. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వద్దన్నందుకు బాలింత భర్తపై దాడి!

KGH Ambulance Mafia: రుయా ఆస్పత్రి ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో అవమానీయ సంఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రి సిబ్బంది పేషెంట్ల బంధువులపై దాడి చేశారు. తమకు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనం వద్దు అని చెప్పినందుకే తమపై దాడికి తెగబడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ సొంత వాహనంలో ఇంటికి వెళ్తామని చెప్పినందుకు బాలింత భర్తపై దాడి చేశారని అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 

ఏం జరిగిందంటే?

అనకాపల్లి జిల్లాలోని ఎస్. రాయవరం మండలం పెనుగోలు ధర్మవరానికి చెందిన మనోజ్ అనే వ్యక్తి తన భార్య ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో ఇటీవలే చేర్చాడు. ఆమెకు పండంటి మగబిడ్డ పట్టగా.. ఇప్పుడామె డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వారి బంధువులు ఓ వాహానాన్ని తీసుకొచ్చారు. 

అయితే అంతలోనే కేజీహెచ్ ఆస్పత్రిలోని తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనానికి చెందిన ఓ డ్రైవర్ వచ్చి తాను ఇంటికి చేరుస్తానని చెప్పాడు. తమకు స్వంత వాహనం ఉందని బాలింత భర్త అన్నాడు. కానీ, వారి మాటలు వినని డ్రైవర్.. బాలింత, బిడ్డను కలిపి ఆస్పత్రికి చెందిన తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లోనే తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. అందుకు వారు అంగీకరించకపోవడం వల్ల డ్రైవర్ మనోజ్ పై దాడి జరిగింది. ఈ క్రమంలో మనోజ్ కంటిపై గాయం కారణంగా రక్తం కూడా వచ్చినట్లు స్థానికులు చెప్పారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు.  

ALso Read: Ruia Ambulance Mafia: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో హృదయవిదారక ఘటన.. మృతదేహాన్ని బైక్ పై తరలింపు!

Also Read:AP Inter hall Tickets 2022: ఏపీ ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News