Horoscope Today April 27 2022: రాశి ఫలాలు.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ రాశి వారికి గుడ్ న్యూస్ అందుతుంది..

Horoscope Today  April 27 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొన్ని రాశుల వారికి ఇవాళ గుడ్ న్యూస్ అందుతుంది. మరికొన్ని రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 12:42 PM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్నిరాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • చంద్రుడి అనుగ్రహంతో మేష రాశి వారికి శుభం
  • ఏయే రాశుల వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today April 27 2022: రాశి ఫలాలు.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ రాశి వారికి గుడ్ న్యూస్ అందుతుంది..

Horoscope Today April 27 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారు ఆకస్మిక ప్రయాణాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు కొన్ని రాశుల వారికి వ్యాపార పరంగా కలిసొస్తాయి. తద్వారా వారి నెట్‌వర్క్ మరింత విస్తృతమవుతుంది. ఇవాళ్టి రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి... 

మేషరాశి ( Aries)

ఇవాళ మీపై చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. మీ కృషి కారణంగా ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. వృత్తి లేదా వ్యాపార పరంగా మీ పనితీరు మరింత మెరుగవుతుంది. మీ జీవితం మరింత సాఫీగా, ఉన్నతంగా సాగేందుకు కొందరు వ్యక్తులు సలహాలు, సూచనలు ఇస్తారు.  తద్వారా చాలాకాలంగా మీరు ఇబ్బందిపడుతున్న కొన్ని సమస్యల నుంచి సులువుగా బయటపడుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీరు సంతోషంగా గడుపుతారు. మీరు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆధ్యాత్మికత మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పుణ్యక్షేత్రాలు, స్వచ్చంద సంస్థలకు కొంత ఆర్థిక సాయం అందిస్తారు. విద్య లేదా వ్యాపార రీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. సింగిల్స్‌ తమ సోల్‌మేట్‌ను కలుసుకునే అవకాశం.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. మూడీగా ఉంటారు. ఇది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. చేపట్టిన పనులు పూర్తవడంలో జాప్యం జరుగుతుంది. వృత్తిపరంగా అది మీ పలుకుబడిపై ప్రభావం చూపిస్తుంది. లాంగ్ డ్రైవ్ లేదా అడ్వెంచర్ టూర్స్‌కు దూరంగా ఉండటం బెటర్. ప్రేమికులు బ్రేకప్ చెప్పుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ మీ చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుంది. పరిస్థితులన్నీ నియంత్రణలో ఉంటాయి. స్నేహితులు లేదా సన్నిహితుల భాగస్వామ్యంతో కొత్త బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభిస్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల మరింత నమ్మకం కుదురుతంది. అది మీ కుటుంబ జీవితం సాఫీగా సాగేందుకు దోహదపడుతుంది.

సింహ రాశి (LEO)

వృత్తి రీత్యా ఇవాళ మీరు బిజీ బిజీగా గడుపుతారు. మీ నెట్‌వర్క్ మరింత విస్తృతమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి భారీ ఆర్డర్ ఒకటి వస్తుంది. అది మీ ఆర్థిక స్థితిగతులను మారుస్తుంది. మీ వ్యాపారంలోకి కొత్త పెట్టుబడులు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దాదాపుగా నయమవుతాయి. తోబుట్టువులతో ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి జాబ్ దొరుకుతుంది.

కన్య రాశి (Virgo)

పిల్లలను చదివించడంలో బిజీగా గడుపుతారు. పిల్లల ఉన్నత విద్య కోసం ముందు నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంటారు. పిల్లల చదువుల విషయంలో గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది. మీరు చేపట్టే పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.

తులా రాశి (Libra)

ఇవాళ మీకు నిరాశజనకంగా గడుస్తుంది. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఫోకస్ పెట్టలేరు. పెట్టుబడుల్లోనూ నష్టాలు చవిచూస్తారు. కీలక పత్రాలపై సంతకాలు చేసేముందు డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదవండి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. మీ ఇంటిని పునర్నిర్మించేందుకు ప్లాన్ చేస్తారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్లాన్స్‌ని వాయిదా వేయడం మంచిదని గుర్తించండి. 

వృశ్చిక రాశి (Scorpio)

ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారికి అన్ని విధాలా కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకుంటారు. అది బాస్ నుంచి గుర్తింపు దక్కేలా చేస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు గుడ్ న్యూస్ వింటారు. స్నేహితులతో అనవసర వివాదాలు చేటు చేస్తాయి. పెళ్లి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

ధనుస్సు రాశి (Sagittarius)  

కుటుంబంతో బిజీ బిజీగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అది మీ ఆర్థిక స్థితి గతులను మరింత ఉన్నతంగా మారుస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అది సమాజంలో మీ పలుకుబడిని పెంచుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగించవచ్చు.

మకర రాశి (Capricorn) 

పెద్దల ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. గతంలో కొన్ని చికాకుల కారణంగా పనులపై సరిగా దృష్టి పెట్టలేకపోయిన మీరు... ఇప్పుడు చేపట్టే పనులపై పూర్తి దృష్టి సారిస్తారు. ఉద్యోగ, వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఖర్చులు, సేవింగ్స్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. అది మీ ఆర్థిక పురోగతికి కారణమవుతుంది.  వ్యక్తిగత, వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. 

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీకు నిరాశజనకంగా ఉండొచ్చు. బద్దక మనస్తత్వం మిమ్మల్ని సోమరితనానికి అలవాటు చేస్తుంది. అది విడనాడితే అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రేమలో ఉన్నవారు ప్రస్తుతానికి పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. 

మీన రాశి (Pisces) 

వృత్తిపరంగా కొన్ని ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అక్కడ కొత్త పరిచయాలు మీకు కలిసొస్తాయి. మీ వ్యాపార పురోగతికి వారి సలహాలు, సూచనలు దోహదపడుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపార భాగస్వాములతో ఆచీ తూచీ వ్యవహరించాలి. వ్యాపార నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకోండి. 

Also Read: Patel vs Parag: పటేల్, పరాగ్‌ల మాటల యుద్ధం, ఒకరిపై మరొకరు దూసుకుపోయి...

Also Read: Tamilnadu: తమిళనాడులో ఘోర విషాదం... రథోత్సవంలో విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News