Venus and Diamond: వజ్రం ధరించడం స్టేటస్ సింబల్‌గా మారింది. కానీ వజ్ర ధారణ అనేది శుక్ర గ్రహాన్ని బలోపేతం చేస్తుంది. ఒకవేళ వజ్రాన్ని ధరించిన తరువాత కూడా మీకు ప్రయోజనం కలుగకపోతే..ఈ పద్ధతి అవలంభించండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది వజ్రపు ఉంగరాన్ని ధరిస్తారు కానీ..స్టేటస్ సింబల్ కోసమే ధరిస్తుంటారు. వజ్రం చాలా ఖరీదైంది. వజ్రమనేది స్టేటస్ సింబల్‌గానే కాకుండా జ్యోతిష్యపరంగా చాలా మహత్యముంది. వజ్రం ధరిస్తే ప్రయోజనాలు అధికమంటారు. అయితే కొంతమందికి వజ్రం ధరించిన తరువాత కూడా ఏ విధమైన ప్రయోజనాలు చేకూరవు. దీనికి జ్యోతిష్య పండితులు చెప్పే సమాధానం ఒక్కటే. వజ్రం ధరించినా..కుటుంబసభ్యుల బంధాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వజ్ర ధారణ ప్రయోజనాలు చేకూరవని అంటున్నారు. కుటుంబంలోని ఏ బంధంతో వజ్రానికి నేరుగా సంబంధముందో పరిశీలిద్దాం..


శుక్రగ్రహం కటాక్షం పొందేందుకు చాలామంది వజ్రాన్ని ధరిస్తుంటారు. వజ్రాన్ని ఉంగరం రూపంలో లేదా మెడలో ఛైన్ రూపంలో ధరిస్తుంటారు. శుక్రగ్రహం సుఖ సంతోషాల్ని ప్రసాదించే గ్రహం. అందుకే వజ్రాన్ని ధరిస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ప్రతీకగా చెబుతారు. ఎవరి కుండలిలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడో..వారంతా శారీరక, ఆర్ధిక సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. 


వజ్రాన్ని ధరించిన తరువాత ఆ వజ్రాన్ని యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కుటుంబంలో ఎవరి శుభాశీస్సులు ఉండాలనేది ముందుగా తెలుసుకోవాలి. వజ్రం సంబంధం నేరుగా భార్యతో ఉంది. ఇంట్లో భార్య లేదా కోడలు దుఖంతో ఉంటే శుక్రగ్రహం ప్రసన్నమవకుడా..ఆగ్రహం చెందుతాడు. ఒకవేళ శుక్రుడు ఆగ్రహం చెందితే..వజ్రం పూర్తి ప్రయోజనం చేకూరదు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉండాలి. అప్పుడే శుక్రుడి ఆశీర్వాదం లభిస్తుంది. వజ్రం ప్రయోజనాలు పూర్తిగా కలుగుతాయి.


జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడకూడదు. ఆమెకు ఏ విధమైన కష్టాన్నివ్వకూడదు. దూషించకూడదు. జీవిత భాగస్వామిని గౌరవించాలి. మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు ఇలా చేస్తే..ఇక మీ జీవితంలో మాధుర్యం వచ్చేసినట్టే. ఏ వ్యక్తి జీవితంలోనైనా..భార్య వస్తూనే స్థిరత్వం వచ్చేస్తుంది. జీవిత భాగస్వామితో సహయోగం సరిగ్గా ఉంటే..ఆ వ్యక్తికి అంతా శుభమే జరుగుతుంది. అటు వజ్రం కూడా యాక్టివ్ అవుతుంది. 


ఒకవేళ ఎవరి జీవితంలోనైనా భార్య లేకపోతే..అవివాహితుడైతే ఆ వ్యక్తి మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలి. ప్రతిరోజూ దేవి మందిరానికి వెళ్లాలి. నవరాత్రుల్లో భగవతి దేవి ఉపాసన చేయాలి. ఎవరైనా పేదమ్మాయి వివాహానికి ఆర్ధిక సహాయం అందించాలి. ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా వజ్రం యాక్టివ్ అవడమే కాకుండా శుక్రుడి కటాక్షం పూర్తిగా లభిస్తుంది. 


Also read: Astro Hints: వృషభరాశిలో శుక్రుడు, జూన్ 18 ఉదయం నుంచి మారిపోతున్న ఆ నాలుగు రాశుల జాతకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook