Grah Gochar 2023: దీపావళికి ముందు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం.. ఇందులో మీ రాశి ఉందా?
Shani Shukra Gochar 2023: నవంబరు నెల ప్రారంభంలో శని, శుక్రుల గమనంలో పెను మార్పు రాబోతుంది. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Grah Gochar 2023 effect: మరో నాలుగు రోజుల్లో నవంబరు నెల మెుదలుకానుంది. అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నవంబరు 03న సింహరాశి నుండి బయటకు వెళ్లి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. మరుసటి రోజే న్యాయదేవుడైన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమన దిశ నుంచి మార్గంలోకి రానున్నాడు. ఈ రెండు గ్రహాల రాశిలో మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. దీపావళికి ముందు ఈ రెండు గ్రహాల సంచారం వల్ల ఏ రాశులు వారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
మిథునరాశి- శని మరియు శుక్రుల సంచారం మిధునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల ఉంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
మకర రాశి - గ్రహాల సంచారం వల్ల మకరరాశి వారు విపరీతమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు డబ్బును ఆదా చేస్తున్నారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
మేషం- శని-శుక్రుల సంచారం వల్ల నవంబర్ నెలలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కెరీర్ బాగుంటుంది.
వృషభం - నవంబర్ నెల మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఊహించని మెుత్తంలో డబ్బు పొందుతారు.
Also Read: Chandra Grahan 2023: రేపే చివరి చంద్రగ్రహణం.. ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.