Lunar Eclipse 2023 effect on Zodiac Signs: సైన్స్ ప్రకారం, సూర్య, చంద్రగ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. సనాతన ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా సూర్య, చంద్ర గ్రహణాల మధ్య 15 రోజుల సమయం ఉంటుంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 రాత్రి 11:32 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 29 తెల్లవారుజామున 3:36 వరకు ఉండనుంది. ఈ చంద్రగ్రహణం 4 రాశుల వారికి అశుభ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో నాలుగు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషరాశి
చంద్రగ్రహణం కారణంగా మేషరాశి వారి ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరుగుతాయి. మీ పనిలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. గ్రహణం యెుక్క చెడు ప్రభావాలను నివారించడానికి మెుక్కలకు నీళ్లు పోయండి.
తులారాశి
తులారాశి యెుక్క జాతకంలో ఏడవ స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. గ్రహణం అశుభ ప్రభావాలను తగ్గించడానికి మీరు అవసరమైన వారికి పాలు దానం చేయండి.
వృశ్చిక రాశి
చంద్రగ్రహణం కారణంగా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. మీపై ప్రత్యర్థులు విజయం సాధిస్తారు. మీరు బయటకు వెళితే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. గ్రహణం వల్ల కలిగే అశుభ ఫలితాలను నివారించడానికి మీ చేతులతో మీ తండ్రికి ప్రతిరోజూ పాలు తాగించండి.
కర్కాటక రాశి
మీ జాతకంలో పదో స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు మీ కెరీర్లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. మీ జీతం మరియు అలవెన్సులు పెరగకపోవడం వల్ల మీకు పనిచేయాలని అనిపించదు. ఈ సమయంలో మీరు చాలా ఓపికతో ఉండాల్సి వస్తుంది.
Also Read: Lunar Eclipse 2023: 9 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక చంద్రగ్రహణం..ఈ గ్రహణం ఏం సూచించబోతోంది.?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.