Monthly Horoscope February 2023; ఫిబ్రవరి నెల గ్రహ సంచారాల పరంగా చాలా ముఖ్యమైనది. ఈ నెలలో సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు తమ రాశులను మార్చనున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 07న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మరోవైపు ఫిబ్రవరి 13 తర్వాత కుంభరాశిలో శని, సూర్యుని కలయిక ఉంటుంది. ఈ గ్రహా సంచారాలన్నీ ఐదు రాశులవారికి చాలా మేలు చేస్తాయి. ఆ అదృష్ట రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 2023 ఈ రాశుల వారికి చాలా శుభప్రదం
మేషం: ఫిబ్రవరిలో గ్రహాల సంచారం మేష రాశి వారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.
కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల శుభప్రదంగా ఉంటుంది. వీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. లవ్ లైవ్ బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
కన్య: ఫిబ్రవరిలో జరిగే గ్రహ సంచారాలు కన్యారాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం  గడుపుతారు. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది.


తుల : ఫిబ్రవరి మాసంలో తుల రాశి వారికి లాభాలు మెండుగా ఉంటాయి. లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 
కుంభం: కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా మేలు చేస్తుంది. మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీరు మతపరమైన కార్యాలలో పాల్గొనవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


Also Read: Shani Shukra Gochar: అరుదైన యోగం చేయబోతున్న శని-శుక్రుడు.. ఇక ఈ 4 రాశులవారికి పండగే పండుగ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook