Grah Gochar in January 2024: మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభ నెల అయిన జనవరిలో ప్రధాన గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. ఈ గ్రహ రాశుల మార్పు కారణంగా కొన్ని రాశులవారు శుభఫలితాలను  పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల సంచారం
జనవరి 2న బుధుడు వృశ్చికరాశిలో నేరుగా నడవనున్నాడు. ఆ తర్వాత సూర్యుడు జనవరి 15న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం జనవరి 16న కుజుడు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. రెండు రోజుల తర్వాత అంటే జనవరి 18న శుక్రుడు ధనస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఈ గ్రహాల రాశి మార్పు మేష, కన్యా, మకర రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 
మేష రాశి
కొత్త సంవత్సరంలో గ్రహాల సంచారం వల్ల మేషరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులకు వ్యాపిస్తాయి. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది.  మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
కన్యా రాశి
గ్రహాల రాశి మార్పు కన్యా రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీకు సంతాన సుఖం కలుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు కష్టాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.


Also Read: Horoscope 2024: శని గ్రహం వల్ల 2024లో ఈ 3 రాశులకు కష్టాలు.. మీ రాశి ఉందా?


మకర రాశి
జనవరి నెల మకర రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు ధనవంతులు అవుతారు. మీ కెరీర్ లో ఎదుగదల ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 


Also Read: Kubera Graces 2024: 2024లో ఈ రాశుల వారిపై కుబేరుడి అనుగ్రహం..వీరికి సంపాదన, డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter