Shani Vakri 2024 effect: మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే న్యూఇయర్ వస్తుందంటే కొంత మంది కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు 2024లో తమ ప్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి జ్యోతిష్య నిపుణులు సంప్రదించి..దానికి అనుకూలంగా పనులు చేస్తారు. అయితే మనకు శుభాలు జరగాలన్నా, అశుభాలు జరగాలన్నా గ్రహాల గమనం అనేది చాలా ముఖ్యం. మీ జాతకంలో గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మీరు మంచి ఫలితాలను, అదే ప్రతికూల స్థానంలో ఉంటే చెడు ఫలితాలను పొందుతారు.
అష్టగ్రహాల్లో శని కూడా ఒకటి. ఖగోళ శాస్త్రం ప్రకారం, దీనికే అత్యధిక ఉప గ్రహాలు ఉన్నాయి, మరి చాలా అందమైన గ్రహం కూడా. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని అంటే అందరూ భయపడతారు. ఎందుకంటే ఇతడు దృష్టి పడిందంటే వారి జీవితం నాశనమైపోతుందని ఓ నమ్మకం. అయితే శనిదేవుడు ఎప్పుడు మనం చేసే పనులు ఆధారంగానే శిక్షలు వేస్తాడు. మంచి పనులు చేస్తే శుభ ఫలితాలను, చెడు పనులు చేస్తే శిక్షలను వేస్తాడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఇతడు సూర్యదేవుడికి పుత్రుడు కూడా. పైగా బద్దశత్రువులు.
Also read; Bhogi Festival: 2024లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు?
అయితే కొత్త సంవత్సరంలో శని కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. జూన్ 29న కుంభరాశిలో రివర్స్ లో కదలడం ప్రారంభిస్తాడు. దీని కారణంగా మేషం (Aries), సింహం (Leo), వృశ్చికం (Scorpio) రాశులవారు సమస్యలను ఎదుర్కోంటారు. నవంబరు 15 వరకు వీరిని శనిదేవుడు ఇబ్బంది పెడతాడు. శని ప్రత్యక్ష కదలికలోకి వచ్చిన తర్వాత ఈ రాశుల కష్టాలు తొలగిపోతాయి. అందుకే నూతన సంవత్సరంలో ఈ మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడి ఆగ్రహానికి గురయ్యే పనులు చేయవద్దు.
Also read: Guru Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook