Gupt Navratri 2022 Shubh Muhurta: హిందూ మతంలో దుర్గాదేవి నవరాత్రులు ఏడాదికి 4 సార్లు జరుపుకుంటారు. అశ్వినీ, చైత్ర మాసాల్లో నవరాత్రుల గురించి అందరికీ తెలిసిందే. గుప్త నవరాత్రులు ఆషాఢ, మాఘ మాసాల్లో జరుపుకుంటారు. గుప్త నవరాత్రుల (Gupt Navratri 2022) రోజున తంత్ర సిద్ధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు జూన్ 30 గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. గుప్త నవరాత్రి రోజుల్లో భక్తులు పూజలు రహస్యంగా చేస్తారు. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గుప్త నవరాత్రులలో కొన్ని  ప్రత్యేక చర్యలు (Gupt Navratri 2022 Remedies) చేయాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుప్త నవరాత్రులలో ఈ పరిహారాలు చేయండి
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గుప్త నవరాత్రుల రోజుల్లో ఉదయమే స్నాం చేసి... హనుమంతుడి ఆలయంలో పాన్ సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహిస్తాడు.  అలాగే తంత్ర సాధనలో కూడా విజయం ఉంది. 
>> ఒక వ్యక్తి యొక్క జాతకంలో వివాహానికి సంబంధించిన సమస్య ఉంటే.. దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి.  ప్రతిరోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా పూల మాల సమర్పించండి. ఈ పరిహారం ద్వారా ఒక వ్యక్తి వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
>> గుప్త నవరాత్రులలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, బంగారు మరియు వెండి నాణేలు లేదా ఆభరణాలను ఇంటికి తీసుకురావాలని నమ్ముతారు.
>> మీరు వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలనుకుంటే.. గుప్త నవరాత్రులలో దుర్గా మాత ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనితో పాటు 9 బటాసులు తీసుకొని దానిపై రెండు లవంగాలు వేయండి. తర్వాత ఒక్కొక్కటిగా దుర్గాదేవికి సమర్పించండి. దీంతో దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.


శుభ ముహూర్తం 2022 
గుప్త నవరాత్రులు జూన్ 30న ప్రారంభమై.. జూలై 8 వరకు కొనసాగుతాయి. ఈ రోజున ఉదయం 5.26 గంటల నుండి 6.45 గంటల వరకు కలశ స్థాపనకు శుభప్రదం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.