Guru Chandra Yuti 2023: ఉగాది నుండి ఈ రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
Guru Chandra Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఉగాది నాడు అంటే మార్చి 22న మీన రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. బృహస్పతి మరియు చంద్రుని కలయిక ద్వారా ఏర్పడిన ఈయోగం కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది.
Chandra Guru Yuti in meen 2023 effects: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం కారణంగా వివిధ రాశులతో పొత్తులు ఏర్పడతాయి. ఈ పొత్తులు వివిధ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. మార్చి 22న మీనరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. వీరిద్దరి కలయిక గజకేసి రాజయోగాన్ని సృష్టిస్తుంది. మీనరాశిలో ఏర్పడిన ఈ యోగం కొన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. అయితే 3 రాశుల వారు ఈ గజకేసరి రాజయోగం వల్ల ఆర్థిక లాభాలు, పురోభివృద్ధి కలుగుతాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గజకేసరి యోగం వీరికి శుభప్రదం
కర్కాటకం: గురు, చంద్ర కలయికతో ఏర్పడిన గజకేసరి రాజయోగం కర్కాటకరాశి వారికి ఆర్థికంగా అపారమైన లాభాలను ఇస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పనుల్లో విజయం దక్కుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
ధనుస్సు: ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో లాభాలుంటాయి. మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బిజినెస్ పెరుగుతుంది. మీడియా, గ్లామర్ రంగంతో సంబంధం ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు.
మీనం: గురు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడిన గజకేసరి యోగం మీనరాశిలో మాత్రమే ఏర్పడుతోంది. దీని వల్ల మీన రాశి వారికి గరిష్ట ప్రయోజనం చేకూరుతుంది. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.
Also read: Budh Guru Yuti 2023: మీనరాశిలో బృహస్పతి-బుధ సంయోగం... ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook