Guru Mahadasha 2024: 16 సంవత్సరాల పాటు గురు మహర్దశ.. జాతకంలో ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే వినాశనమే!
Guru Mahadasha 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఎలాంటి ప్రముఖ్యత ఉందో, మహర్దశలకు కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో ఏదైనా మహర్దశలు ఏర్పడతే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో.. ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Guru Mahadasha 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సంచారం చేయడం, తిరోగమనం చేయడం, రివర్స్‌లో తిరగడం కారణంగా అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా వ్యక్తి జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా కూడా వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావడం పడుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా యోగాలు ఏర్పడడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే వీటికే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలొ తరచుగా నవగ్రహ మహాదశలు కూడా ఏర్పడతాయి. దీని కారణంగా కూడా వ్యక్తులు జీవితాలు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
నవగ్రహ మహర్దశ ఏర్పడినప్పుడు ఈ దశలో వ్యక్తులు జాతకంలో గ్రహాన్ని బట్టి ప్రభావం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి మహర్దశ వ్యక్తిపై దాదాపు 16 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటే జీవితంలో అన్ని రకాల సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం కోష్ఠిలో ఉంటే సంపద కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికతపై కూడా మెగ్గు చూపుతారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి.
మహర్దశ సమయంలో కుజుడు జాతకంలో శుభస్థానంలో'ఉంటే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో ఉన్న స్థాయిలకు కూగా ఎదుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇక విద్యార్థులకైతే, ఈ సమయంలో చదువుపై ఆసక్తి పెరిగి ర్యాంకులు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా జ్ఞానం పెంపొందించుకోవాలనుకునే కోరికలు కూడా పుడతాయి. అలాగే కొత్త విషయాలపై కూడా అసక్తి పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇక ఆర్థిక పరిస్థితులు విషయానికొస్తే, విపరీతమైన డబ్బును కూడా పొందుతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బృహస్పతి గ్రహం జాతకంలో అశుభ స్థానంలో ఉంటే అనేక రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇంట్లో సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మతపరమైన కార్యకలాపాలు, పూజలపై కూడా ఆసక్తి తగ్గుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పొట్ట సమస్యలు, జీర్ణక్రియ దెబ్బతినడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి