Guru Pushya yogam 2022: ఆస్ట్రాలజీలో పుష్య నక్షత్రం లేదా పుష్యమి నక్షత్రం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆస్తి, వాహనం, గోల్డ్, ఇల్లు వంటివి కొనుగోలుకు, ఏదైనా శుభకార్యం చేయడానికి, కొత్త పనిని ప్రారంభించడానికి పుష్య నక్షత్రం (Pushya Nakshatra 2022) చాలా అనుకూలంగా ఉంటుంది.  అందుకే చాలా మంది విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి పుష్యమి నక్షత్రం కోసం ఎదురు చూస్తారు. ముఖ్యంగా పుష్య నక్షత్రం గురువారం నాడు ఏర్పడితే మరింత శుభప్రదంగా భావిస్తారు. రేపు అంటే ఆగస్టు 25, 2022 గురువారం నాడు గురు పుష్య నక్షత్రం ఏర్పడుతుంది. దీంతోపాటు ఇదే రోజు మరెన్నో శుభయోగాలు ఏర్పడుతున్నాయి.1500 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. ఈరోజున మీరు షాపింగ్ చేస్తే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుదైన యాదృచ్ఛికం
పంచాంగం ప్రకారం, ఆగష్టు 24 బుధవారం 01:38 నుండి ఆగస్టు 25 గురువారం సాయంత్రం 04.50 వరకు పుష్య నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలోనే సర్వార్థసిద్ధి, అమృతసిద్ధి మరియు వారియన్ వంటి పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతోపాటు శుభకార్తరీ, వరిష్ట, భాస్కర్, ఉభయచారి, హర్ష్, సరళ్, విమల్ అనే రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సూర్యుడు తన స్వంత రాశి అయిన సింహరాశిలో, కర్కాటకంలో చంద్రుడు, కన్యారాశిలో బుధుడు మరియు మకరరాశిలో శని ఉంటాడు. ఈ ముఖ్యమైన గ్రహాలు తమ సొంత రాశిలో ఉండి.. ఈ సమయంలో గురు పుష్యంగా ఉండటం అరుదైన యాదృచ్చికం. 1500 సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది.  


Also Read: సూర్యుడు-శుక్రుడు కలయిక... ఆగస్టు 31 నుంచి ఈ రాశులకు పండగే పండుగ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook