Benefits of Guru Pushya Yoga 2023: ఆస్ట్రాలజీలో ముఖ్యమైన యోగాల్లో గురు పుష్య యోగం ఒకటి. గురువారం పుష్య నక్షత్రం ఏర్పడుతుంది. దీనినే గురు పుష్య నక్షత్రం అని కూడా అంటారు. గురు పుష్య యోగంలో కొన్ని పనులు చేయడం శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ గురు పుష్యయోగం మే 25న ఏర్పడుతుంది. ఇదే రోజు అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. అది ఏంటంటే వృద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు రవి యోగం రూపొందుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున చేసే కొన్ని కార్యాలు మీకు శుభఫలితాలను ఇస్తుంది. మే 25న సూర్యోదయం నుండి సాయంత్రం 05:54 వరకు గురు పుష్య యోగం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు పుష్య యోగం రోజున 5 శుభ యోగాలు
మే 25న గురు పుష్య యోగంతో సహా 5 శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రోజున వృద్ధి యోగం సాయంత్రం 06:00 నుండి 08:00 వరకు ఉంటుంది. గురు పుష్య యోగం ఉదయం 05:26 నుండి సాయంత్రం 05:54 వరకు ఉంటుంది. అమృత సిద్ధి యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉదయం 05:26 నుండి సాయంత్రం 05:54 వరకు, రవియోగం ఉదయం 05:26 నుండి సాయంత్రం 05:54 వరకు ఉంటుంది. గురుపుష్య యోగం రోజున బంగారం, పసుపు,  పప్పు, మతపరమైన పుస్తకాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. 


Also Read: Poison Yogam: మీ జాతకంలో విష యోగం ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి