Guru Uday 2023 in Mesh Rashi: ఈరోజు మేషరాశిలో బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. రాహువు కూడా గురువుతో పాటు మేషరాశిలో సంచారం చేయబోతోంది..కాబట్టి ఈ క్రమంలో గురు చండాల యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో మేష రాశిలో బుధు కూడా సంచారం చేస్తున్నాడు. ఈ చండాల యోగం వల్ల సింహ రాశితో పాటు మరో 5 రాశులవారిపై ప్రభావం పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశువారు పలు అంశాలపై శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర దృష్ప్రభావాలకు గురయ్యే ఛాన్స్‌ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై గురు చండాల యోగం ప్రభావం:
సింహరాశి:

బృహస్పతి సంచారం వల్ల సింహ రాశులవారికి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కెరీర్‌లో చాలా సవాళ్లుతో పాటు తీవ్ర నష్టాలు రావొచ్చు. అంతేకాకుండా గురు చండాల యోగం వల్ల  ఆర్థిక సంక్షోభాలు ఎదురయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సమయంలో మీ మనస్సు మతపరమైన పనులలో ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. వ్యాపారంలో కొన్ని పెద్ద మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్నవారికి ప్రత్యర్థు గట్టి పోటీని ఇచ్చే ఛాన్స్‌ ఉంది. 


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


కన్యారాశి:
మేష రాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల కన్యా రాశివారికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా జీవితం మొత్తం బిజీ బిజీ ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  ఈ క్రమంలో ఇంట్లో వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి కూడా వెళ్తారు. ఇక కెరీర్ విషయానికొస్తే..ఉద్యోగాల చేస్తున్నవారికి ప్రమోషన్‌ కారణంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  సొంత వ్యాపారం ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


తులారాశి:
గురు గ్రహం భావించే బృహస్పతి సంచారం వల్ల తులారాశి వారికి అశుభ యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన గుర్తింపు లభించదు. కాబట్టి తప్పకుండా కష్టపడి పనులు చేయాల్సి ఉంటుంది. ఆఫీసు పనిలో తీవ్ర ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చు. వ్యాపారంలో కొన్ని కారణాల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అశుభ యోగం మీ ఇంటిలోని కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.


వృశ్చికరాశి:
ఈ రోజు జరిగే ఈ సంచారం వల్ల చండాల యోగం ఏర్పుడుతుంది. కాబట్టి విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కుటుంబంలో చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒత్తిడి సమస్య, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్ పొందడంలో జాప్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.  ప్రేమ వ్యవహారాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉండవచ్చు.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook