Ugadi 2023 Date: పంచాంగం ప్రకారం, హిందూ నూతన సంవత్సరం మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. అదే రోజు మన తెలుగు వారు ఉగాది పండుగను  జరుపుకుంటారు. దీనితోపాటు చైత్రనవరాత్రులు కూడా అప్పడి నుండే ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా ఉగాది నాడు శష్, గజకేసరి మరియు బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో, గురుడు 12 ఏళ్లు తర్వాత మీన రాశిలో సంచరించడం మరొక విశేషం. ఇన్ని శుభ యాదృచ్ఛికాలు కారణంగా కొత్త సంవత్సరం 4 రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశిచక్రం


హిందూ నూతన సంవత్సరం తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో శనిదేవుడు ఐదవ ఇంట్లో మరియు బృహస్పతి మీ రాశి నుండి ఆరవ ఇంట్లో ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులకు కోరుకున్న విద్యాసంస్థలో అడ్మిషన్ దొరుకుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. 


మకర రాశిచక్రం
ఉగాది నుండి మీ అదృష్టం ప్రకాశిస్తుంది. ఎందుకంటే మీ జాతకానికి సంబంధించిన సంపద ఇంట్లో శనిదేవుడు మరియు మూడవ ఇంట్లో బృహస్పతి సంచరిస్తున్నారు. దీంతో మీకు ఆఫీసులో సహచరుల మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహం ఫిక్స్ అవుతుంది. 


సింహ రాశి
సింహ రాశి వారికి హిందూ నూతన సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు ఏడవ ఇంట్లోనూ, బృహస్పతి ఎనిమిదో ఇంట్లోనూ సంచరిస్తున్నాడు. దీంతో మీకు మీ జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. 


ధనుస్సు రాశిచక్రం


ఉగాది మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీ వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీరు ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.


Also Read: Budh Guru Yuti 2023: మీనరాశిలో బుధ-గురు సంయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook