Horoscope 2024: త్వరలోనే 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది.  ఈ సంవత్సరం కొన్ని రాశులవారికి చాలా శుభపద్రంగా ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే కొన్ని గ్రహాల సంచారం కారణంగా లాభాలతో పాటు భారీ నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో గ్రహాల సంచారం కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం:
మేషరాశి:

మేషరాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో గౌరవం పెరగడమే కాకుండా కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా 2024 సంవత్సరంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి..మంచి లాభాలు పొందుతారు. 


మిథునరాశి:
కొత్త సంవత్సరం మిథునరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏడాది భూమి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా మీ భాగస్వామి సలహా నుంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
 
కన్యారాశి:
కన్యారాశి వారికి 2024 సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో చిన్న చిన్న కష్టాలను ఎదర్కొనే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 


సింహరాశి:
రాబోయే కొత్త సంవత్సరం సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత స్థాయి పదోన్నతులు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విలాసాలు పెరిగి..విహారయాత్రకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి