Horoscope: మేషరాశిలో సూర్య-శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ ఆరంభం..
Surya-Shukra Yuti In Aries Horoscope: ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya-Shukra Yuti In Aries Horoscope In Telugu: ఒక నిర్దిష్ట సమయంలో గ్రహాలు రాశులు మారుతూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి. అయితే మొత్తం 12 రాశులు గ్రహ సంచారం చేస్తాయి. ఇలా గ్రహ ప్రవేశం చేయడం వల్ల శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఎంతో ప్రాముఖ్యత కలిగి శుక్ర గ్రహం ఏప్రిల్ 24వ తేదిన రాశి సంచారం చేయబోతోంది. గ్రహాలకు రాజుగా పరిగణించే ఈ శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. దీంతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
మేషరాశిలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా ఈ సమయం చాలా బాగుంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి లభిస్తుంది. దీని కారణంగా సువర్ణ అవకాశాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితిలో మార్పులు వచ్చి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వృత్తి జీవితంలో కొత్త సవాళ్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగంలో పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కన్య రాశి:
మేషరాశిలో జరిగే సూర్య, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కన్యా రాశివారికి ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇంట్లో శుభ కార్యాలు జరగడం కారణంగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరిగి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపులున్నారు.
తుల రాశి:
శుక్రాదిత్య రాజయోగం తుల రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూగా పురోగతి పొందుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా విజయవంతమవుతాయి. అంతేకాకుండా ఈ రాశులవారు కూడా సులభంగా తిరిగి అప్పులు చెల్లిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి