Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే. మీరు క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఆ రోజు మీ నక్షత్రాలు, రాశులు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండనున్నాయి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి (Today Rasi Phalalu in Telugu)
మీరు చాలా సానుకూల దృక్పథంలో ఈ నెలను ప్రారంభిస్తారు. ఈ రోజు జీవితంలోని అన్ని విషయాలలో మీకు అధిక అవకాశం ఉండనుంది. మీరు వ్యాపార వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. ఇది ఈ రోజు మీకు అదృష్టాన్ని తేనుంది. మీ కుటుంబానికి అండగా నిలుస్తారు. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది. మీకు కావలసిన దానిపై దృష్టి సారించినంత కాలం ఈ రోజు మీకు శుభసూచకాలే ఉన్నాయి.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ



వృషభ రాశి
మీకు ఈ రోజు కలిసొస్తుంది. పలువురు మీ రూపాన్ని మరియు వ్యక్తిత్వాన్ని అభినందిస్తారు. మీరు ఎక్కువ రిస్క్ తీసుకొని సృజనాత్మకత పొందాల్సి ఉంటుంది. మీరు పనిచేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ గురించి మీ సహోద్యోగులతో వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి రోజు. మీకు సమయం ఉంటే మీ భాగస్వామి కోసం ప్రత్యేకంగా ఏదైనా ఆలోచించడం ఉత్తమం.



మిథున రాశి
మీ చుట్టుపక్కల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ భిన్నమైన వ్యక్తిత్వం వారికి అంత సులువగా అర్థం కాదు. మీ ఆలోచనలను మీ సహోద్యోగులకు వివరించడం ద్వారా అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో విషయాలను పంచుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మీరు వారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఈరోజు కలిసి వచ్చే సంకేతాలున్నాయి. ప్రశాంతతను పొందడానికి మీరు కొద్దిసేపు ధ్యానం చేయండి.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


 


కర్కాటక రాశి
మీకు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. గతంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఈ రోజు మీకు తిరిగి కనిపించవచ్చు. తద్వారా మీరు  గందరగోళానికి లోనవుతారు. మీరు మనసు పెట్టి ఆలోచించండి మరియు మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి. మీరు చాలా మందితో మాట్లాడుతున్నందున, మీ భావోద్వేగాలు ఈ రోజు పనిలో మీకు సహాయపడతాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు కలిసొస్తుంది.



సింహ రాశి
ముందుకు సాగే ధోరణి పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో ఓ విషయంలో విజయం సాధిస్తారు. మీరు మీ భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యుడితో ఇబ్బంది పడుతున్నారా? దీనిపై ఆందోళన వద్దు. వారితో మాట్లాడితే మీ సమస్యకు పరిష్కరం దొరుకనుంది. మరోవైపు, ఈ రోజు మీ పని కొంచెం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. కానీ సింహ రాశి వారు సులువుగా దీన్ని అధిగమిస్తారు.


కన్య రాశి
మీరు సాధారణంగా ఇతరులను సంతోషంగా ఉంచుతారు. మీరు అందరికీ మంచివారు కాదని అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఏం కోరుకుంటున్నారో, ఆ దిశగా అడుగులు వేయనున్నారు. పనిలో ఓ ఉద్యోగిగా స్నేహం చేయడానికి బదులుగా, ఒక ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. తద్వారా ప్రమోషన్ లభించే సూచన. ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పాదాన్ని నేలకు తాకేలా చూసుకోండి.


తుల రాశి
మీరు కనిపించే తీరు గురించి మీకు అసురక్షితమా? కాదా తెలుసుకోవాలి. మిమ్మల్ని కొందరు ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే మీరు మాత్రం ప్రేమగా, నవ్వుతూ గడుపుతారు. మీరు సహోద్యోగితో సన్నిహితంగా మెలుగుతారు. మంచి స్నేహాల వల్ల ఎవరికీ హాని కలగదని గ్రహించాలి. మీరు కోరుకున్న వ్యక్తి సైతం మీపై అదే ఆలోచనతో ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అంతా శుభమే.


వృశ్చిక రాశి
మీరు ధైర్యవంతులు. ఈ రోజు మీరు పని మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. గతాన్ని వదిలి, ఇప్పుడు మీరు ఎదగడానికి ప్రయత్నించాలి. ఉన్నతాధికారులను కలుసుకుని కొన్ని పనులపై చర్చిస్తారు. కొంత మంది ప్రజలకు నాయకత్వం వహించవచ్చా? లేదా అని మీ స్నేహితుల అభిప్రాయాలు సేకరిస్తారు. భవిష్యత్ ఎలా ఉండనుందని మీలో ఆందోళన ఎక్కువ అవుతుంది.


ధనస్సు రాశి
ఈ రోజు మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం కన్నా ఇతరుల సలహాలు పాటిస్తే ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్నిసార్లు, మాట్లాడటానికి బదులుగా అవతలి వ్యక్తులను అర్థం చేసుకోవడం, వారి మాటలు వినడం శ్రేయస్కరం. ఇంట్లో మీ ప్రియమైన వ్యక్తి వీరు నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి కొత్త ఆలోచనలను తెరమీదకు తేనున్నారు. మీరు మార్పు కోసం సిద్ధంగా లేనప్పటికీ, వినడానికి ప్రయత్నించండి. మీకు ఆత్రుతను తగ్గించుకుని వ్యవహరించాలి.


మకర రాశి
మీరు చాలా కాలం ఓపికగా ఉంటారు. మీ ఆలోచనలు మరియు అభిప్రాయాలను ముందుకు తీసుకెళ్లాలి. ఇతరులు మీ మాట వింటారని తెలుసుకుంటారు. మీకు నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఉంది. మీరు చెప్పేది ఖచ్చితంగా అవుతుంది. మీరు పనిలో ఉన్నవారి పట్ల కూడా ఆకర్షితులు అవుతారు. అయితే వారు నిజంగానే మీకు కావాల్సిన వ్యక్తులా కాదా ఆలోచించండి.


Also Read: Nirmala Sitharaman ప్రవేశపెట్టనున్న కేంద్ర Budget 2021 ముఖ్యాంశాలు


 


కుంభ రాశి(Today Rasi Phalalu)
మీరు మీ కుటుంబం నుండి ఆసక్తికరమైన వార్తలను అందుకుంటారు. ఏ విషయంలోనూ చింతించకండి. ఈరోజు అంతా బాగుంది. మీ కుటుంబంలో ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే పనులకు కొంత విరామం ఇస్తారు. మిమ్మల్ని మీరు స్వయంగా రక్షించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కొంచెం చిందరవందర చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మొత్తానికి మీకు శుభమే జరుగుతుంది.



మీన రాశి
మీరు నాయకత్వం వహించడానికి ఇది మంచి తరుణం. మీరు విషయాల నుండి తప్పుకున్నట్లు భావించకూడదు. ఈ రోజు అవసరమైన సమయాల్లో మీ గొంతును పెంచుతారు. ప్రజలు మీకు అన్యాయం చేస్తున్నట్లు మీకు అనిపిస్తే, మీరు వారి ముఖంపై చెప్పేయండి. మీరు పని నుండి ఇంటికి చేరుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. ఇంట్లో ఏదైనా ఊహించని శుభవార్త వినడం లేక వేడుకలో పాల్గొంటారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook