Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 02, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనవ్యయం
Today Horoscope In Telugu 02 May 2021: మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 2ద తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 02 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 2ద తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
గతంలో చేసిన తప్పిదాలను విశ్లేషించడానికి మరియు వాటి నుండి నేర్చుకోవడానికి మీరు కొంత సమయం కేటాయిస్తారు. పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకుంటారు. విద్యార్థులు తమ పరిధులను విస్తృతం చేయడానికి కళా రంగంలో ప్రయత్నాలు మొదలుపెడతారు. నేడు మీ మానసిక స్థితి మెరుగ్గా ఉండనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. సన్నిహితులు, బంధువులలో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
వృషభ రాశి
గత కొంతకాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంటారు. మరికొన్ని రోజుల తరువాత ఈ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వివాదాలు నేడు పరిష్కారం చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
మిథున రాశి
ఈ రోజు మీరు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. నేడు మీరు పని మరియు అందుకు సంబంధించిన సమావేశాలతో సతమతమవుతారు. మీరు ఇంటికి వెళ్లగా, పిల్లలు చదువుకుంటూ కనిపిస్తారు. ఏదైనా స్థిర ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కావాల్సిన ఫలితం చేతికి దక్కనుంది. కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు ప్రయాణాలు మీకు శ్రేయస్కరం కాదని, మీరు ఇంట్లోనే ఉండాలని కొందరు సలహా ఇస్తారు. నేడు ఇంటి నుంచి పనులు చేయడానికి యత్నించండి. లేనిపక్షంలో పని నుంచి కాస్త విరామం తీసుకుని, ఆరోగ్యంపై దృష్టిసారించండి. విద్యార్థులు చదువును పక్కనపెట్టి కాలక్షేపం చేయడానికి యత్నిస్తారు. కనుక మీరు మీ పిల్లలకు కాస్త సమయం కేటాయించండి. మానసిక ప్రశాంత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం కాదు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
సింహ రాశి
మీరు ఈ రోజు కుటుంబంతో, ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో బిజీగా గడుపుతారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరిష్కారం దొరుకుతుంది. మీరు సృజనాత్మకతకు సంబంధించిన వాటి కోసం చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో మీకు ఎలాంటి మద్దతు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు పనిలో చికాకు కలుగుతుంది.
కన్య రాశి
మీ వ్యక్తిగత నైపుణ్యాలు ఈ రోజు మీకు మేలు చేకూర్చుతాయి. మీరు అనుకున్న పనులను సమయానికి విజయవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు వారి ఆరోగ్యానికి సంబంధించి అన్ని పరీక్షలు చేయించాలని నిర్ణయించుకుంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి భారం కానుంది.
తులా రాశి
ఈ రోజు పనిలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ సహోద్యోగులలో కొంతమందిని తొలగించడం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఒంటరిగా కొంత సమయం గడపాలని కోరుకుంటారు. విద్యార్థులకు సమయం దొరికినందున పరీక్షలకు సన్నద్ధం కావాలి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
నిద్ర లేకపోవడం వల్ల మీరు కొంచెం అలసిపోయినట్లు కనిపిస్తారు. కాని కొంచెం సమయం మీరు ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పనుల కోసం ప్రయాణాలు చేయాలని భావిస్తే, ఈరోజు ఆ ప్రయత్నాలు మానుకోవాలి. అనవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలతో వివాదాలు తలెత్తుతాయి.
Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!
ధనుస్సు రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోవడం మీకు మేలు చేయనుంది. అదనపు బాధ్యతల కారణంగా మీ పని ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు, కానీ ఇది మీరు నిర్వహించలేని కాదని అర్థం చేసుకోవాలి. మీ మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా లాంటివి చేయాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు నూతన ఉత్సాహం లభిస్తుంది.
మకర రాశి
మీరు క్లయింట్ నుండి పెద్ద ప్రాజెక్టులు స్వీకరించే అవకాశం ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నం వారికి తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు నూతన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు నేడు తమ చదువు, అధ్యయనం నుండి కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం. ఆకస్మిక ధనవ్యయం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యంపై అధిక శ్రద్ధ తీసుకోవాలి.
కుంభ రాశి
మీరు ఈ రోజు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. దైవచింతన పెరుగుతుంది. ఒత్తిడిని జయిస్తే పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చునని అర్థం చేసుకుంటారు. ఈ రోజు మీ ఇంట్లో వృద్ధులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం బయట గడిపి రావడంతో క్రిమికారకాలు మీ వెంట తెచ్చి ఉండవచ్చు. కొంతకాలం నుంచి నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు చేకూరుతాయి.
మీన రాశి
మీ జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తవచ్చు, కానీ కొంచెం సమయం కేటాయించి వారితో మాట్లాడితే పరిస్థితిలో మార్పు రావచ్చు. పిల్లల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రోజు పనిలో మీ వ్యక్తిగత వృద్ధిపై దృష్టిసారించాలి. మీరు ఏమి చేయగలరో చూపించడానికి అదనపు ప్రాజెక్టులకు సమయం కేటాయించాలి. ఇద్దరి ఆలోచనలు కలిస్తే మీ పనులు వేగంగా పూర్తవుతాయి. నూతన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు ఏ ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook