Horoscope Today 04 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 4వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీ మనసు సరైన దారిలో ఆలోచించదు. ఈ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అయితే మీకు శుభవార్త ఏంటంటే, నేడు మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కొన్ని వ్యాపార పరమైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మీకు ప్రమోషన్ లభించవచ్చు. ధనవ్యయం సైతం గోచరిస్తుంది.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


వృషభ రాశి
మీరు చాలా కాలం నుంచి విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. అయితే నేడు కాస్త విరామం తీసుకునేందుకు తగిన సమయం ఇది. పనిలో కొత్తదాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారు. మీరు సాధారణంగా చేసేదానికంటే భిన్నమైనదాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి మరియు దానిలో మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి యత్నిస్తారు. శ్రమ, ఖర్చులు అధికం కానున్నాయి.


మిథున రాశి
ఏదైనా కొత్త పనులను చేపట్టడం మరియు నూతన వ్యక్తులతో పరిచయం సైతం నేడు మీకు కలిసిరాదు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు నేడు చేయరాదు. అదే సమయంలో మీరు ఎదగడానికి ఏమి చేయగలరో ఆలోచించండి. నేడు మీరు చాలా సరదాగా, సంతోషంగా గడపటానికి తగిన సమయం లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితం రానుంది.


కర్కాటక రాశి 
మీరు ప్రయత్నించడానికి, చేయడానికి సిద్ధంగా లేని కొన్ని పనులు ఎంపిక దిశగా పరిస్థితులు మిమ్మల్ని బలవంతం చేస్తాయి. ఆందోళన చెందడానికి ముందుగా సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేయడం ఉత్తమం.  కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి, కనుక మీరు ఈ రోజు వ్యాయామం, శారీరక శ్రమ చేయడానికి కొంత సమయం కేటాయించాలి. దీంతో మీరు మీ రోగనిరోధక శక్తిని పరీక్షించుకుంటారు.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


సింహ రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకుంటారు. మీరు సంపద, ఆస్తి కలిగి ఉంటారు. కానీ దాన్ని ఎలా ఆదా చేయాలన్నదానిపై ఆలోచన చేయకపోవడం శ్రేయస్కరం కాదు. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ఉన్నతాధికారులు గమనించబోతున్నారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవ్వవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులతో కలిసి సరాగా సమయం గడుపుతారు.


కన్య రాశి
మీకు స్ఫూర్తినిచ్చినదాన్ని కనుగొని ఆ దిశగా అడుగులు వేయాలి. కాకపోతే, మీరు పాత స్వభావంతో ఉండటం ద్వారా కోరుకున్నవి చేతికి అందవు. ఏ ఆలోచనలు చేయకపోవడం, ప్రయత్నలోపం కారణంగా మీకు విజయాలు అందే పరిస్థితి గోచరించడం లేదు. ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిస్తారు. అయితే ఉద్యోగులు తమ పనిని సక్రమంగా పూర్తిచేస్తారు.


తులా రాశి
తులా రాశి వారు విరామం తీసుకునేందుకు ఇది తగిన సమయం. అయితే ఇతరులతో కలివిడిగా ఉండాలి. అదే సమయంలో ఈ రోజు మీ కెరీర్‌పై దృష్టి సారిస్తారు. కారు లాంటి ఏవైనా పెద్ద వస్తువులు కొనుగోలు చేసి వాహనయోగం పొందనున్నారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కనుక ఈరోజు మీ సమస్యలు దూరం కానున్నాయి. ఉద్యోగులు, వ్యాపారుల అంచనాలు తప్పుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు.


వృశ్చిక రాశి
చేపట్టిన పనులు మధ్యలోనే నిలిపివేస్తారు. మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, మీ వ్యక్తిగత జీవితంలో కొత్తదాన్ని ప్రయత్నించండి. పనిలో మీకు అప్పగించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ ప్రమోషన్ కాస్త ఆలస్యం కానుంది. అనారోగ్య సమస్య బాధిస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల నుంచి ఒత్తిడి అధికం కానుంది. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు పొందలేరు.


Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 


ధనుస్సు రాశి
గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించడం ద్వారా ఈ రోజు ఎక్కువగా బాధపడతారు. బదులుగా ఒక అడుగు వెనక్కి వేసి, మీ కోసం మరియు కుటుంబం కోసం మీరు ఏం చేశారో గ్రహిస్తారు. చాలా కాలం నుంచి మీరు దూరంగా ఉంటున్న ఓ వ్యక్తితో సంప్రదింపులు ప్రారంభిస్తారు. అయితే ఆచితూచి వ్యవహరించకపోతే సమస్యలు తప్పవు. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకరి నుంచి శుభవార్త అందుకుంటారు.


మకర రాశి
గతంలో మిమ్మల్ని వరించని అవకాశం గురించి చింతించకుండా భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. మీరు మంచి ఫలితాల కోసం పని చేయవచ్చు. ఈ రోజు నిరాశకు గురవుతుంటే, మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయాలి. ఆరోగ్య సమస్యతో చింతన పెరుగుతుంది. వ్యాపారులకు అనుకోని సమస్యలు మొదలవుతాయి. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం యత్నిస్తారు.


కుంభ రాశి
ఈ రోజు మీరు ప్రేమ కోసం పరితపిస్తారు. అయితే మీకు ఏర్పడిన పరిస్థితి నిజమా కాదా అని యోచిస్తారు. ప్రస్తుతం చేస్తున్న పనులకు వ్యతిరేక మార్గంలో వెళ్లాలనుకుంటారు. మరియు వాస్తవానికి కొన్ని రిస్క్‌లు తీసుకోవడం వల్ల పదోన్నతులు, లేక కోరుకున్నది మీ చేతికి దక్కనుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. 


Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి


మీన రాశి
వ్యాపారం విషయానికి వస్తే మీరు చాలా అదృష్టవంతులు. అయితే, మీ ఆరోగ్యంపై కొంచెం దృష్టి సారించాలని భావిస్తారు. మీరు సాధారణం కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సన్నిహితులు, కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు తాము చేసే పనిలో అభివృద్ధిని సాధించే అవకాశాలున్నాయి. నూతన పరిచయాలతో కొన్ని విషయాలు మీ చెవిన పడతాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook