Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 04 జూన్ 2021, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు
Horoscope Today 04 June 2021: అనవసర వస్తువులపై ఖర్చు చేస్తారు. ఈ విషయంపై ఇంట్లో చర్చ జరుగుతుంది. విద్యార్థులు తమ కెరీర్ ఎంచుకోవడానికి అవసరమైన చదువు వివరాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు పనిభారం అధికమైతే విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.
Horoscope Today 04 June 2021: మేష రాశి
ఈ రోజు కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వ్యక్తిగత జీవితంపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు చేయాలని భావిస్తారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. డబ్బును అనవసరమైన పనులకు ఖర్చు చేయకూడదు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి చాలా సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కొత్త నైపుణ్యం నేర్చుకునేందుకు మార్గాన్ని అన్వేషిస్తారు. ఉదయం వేళ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. నేడు మీరు వాహనం కొనుగోలు చేయాలని యత్నిస్తారు. తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయించడం. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నారు.
Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం, Photo Gallery
మిథున రాశి
మానసిక ప్రశాంతత కోసం ఈరోజు కొంత సమయం ధ్యానం చేయండి. మీ పని కొంచెం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. అయితే కొంచెం కష్టమైనా మీరే ప్రాజెక్టు పూర్తి చేస్తారు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానం అందుతుంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి
నేడు పనిచేసే చోట చాలా చురుకుగా వ్యవహరిస్తారు. మీ జీవిత భాగస్వామి పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని భావిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. షేర్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది తగిన సమయం.
సింహ రాశి
అనవసర వస్తువులపై ఖర్చు చేస్తారు. ఈ విషయంపై ఇంట్లో చర్చ జరుగుతుంది. విద్యార్థులు తమ కెరీర్ ఎంచుకోవడానికి అవసరమైన చదువు వివరాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు పనిభారం అధికమైతే విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కన్య రాశి
ఈరోజు మీరు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ పని పూర్తి చేయడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మీ యజమాని మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ రోజు మిమ్మల్ని బాధిస్తుంది. శుభవార్తలు చెవిన పడతాయి.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
తులా రాశి
ఇంటి వద్ద ఉండి మీకు నిజంగా ఏమి కావాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై దృష్టిసారించాలని సలహా ఇస్తారు. అవసరమైతే పని నుంచి ఒక రోజు సెలవు తీసుకోండి. మీకు అవసరం లేని వస్తువులకు, సేవలకు డబ్బు ఖర్చు చేయవద్దని కొందరు సూచిస్తారు.
వృశ్చిక రాశి
ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. వ్యాపారం ఉన్నవారికి ఈ రోజు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో చేసిన పెట్టుబడులకు లాభాలు చేతికి వస్తాయి. ఇంట్లో కుటుంబసభ్యులతో కొంత సమయం సరదాగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనుస్సు రాశి
ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని విద్యార్థులు ఆలోచిస్తారు.
మకర రాశి
నూతన ఇంటిని నిర్మించుకోవడంలో ఓ అడుగు ముందుకు వేయనున్నారు. చాలా రోజుల తరువాత కొందరు స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
కుంభ రాశి
ఈ రోజు మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. వ్యాపారులైతే, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, కొంతకాలం వరకు వేచిచూడండి. విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులతో. కూర్చుని ఆలోచిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం అవుతుంది.
మీన రాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత స్నేహితులు చాలా రోజుల తరువాత మీతో తిరిగి కనెక్ట్ అవుతారు. మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తారు. వ్యాపారులు ఆశించిన మేర ఫలితాలు అందుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook