Horoscope Today 04 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 04వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
గత కొంతకాలం నుంచి మాట్లాడని వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటి బయట సమయం గడపాలని ఈ రోజు భావిస్తారు. రోజువారీ పనులను పక్కనపెట్టి ఇంటి నుంచి బయటపడి మరియు ఇతరులతో మాట్లాడటానికి మీకు ఇది మంచి రోజు. కొన్ని వార్తలు మీకు ఆనందాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos 


వృషభ రాశి
మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. కానీ నేడు భారీ మొత్తంలో ఖర్చులు చేస్తే, మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఆహారం మరియు అవసరమైన వాటికి ధనం వెచ్చించడం ఉత్తమం. కొత్తగా రుణ యాత్నాలు మొదలు పెడతారు.


మిథున రాశి
మీరు ఇల్లు లేదా కారు వంటివి కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, నేడు మీకు అనుకూల సమయం. మీరు చేసే పనిని కొందరు సవాలు చేసే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తారని, అందువల్లే ఈ స్థితిలో ఉన్నారని నిర్ధారించుకోండి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.


కర్కాటక రాశి 
మీ పనులు పూర్తి చేయడంలో భాగంగా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఓ వ్యక్తి తీరు మీకు విసుగు తెప్పిస్తుంది. గత కొంతకాలం నుంచి మీతో మాట్లాడని వ్యక్తులు మీ వద్దకు రానున్నారు. ఆస్తి చేతికి దక్కుతుంది. అయినప్పటికీ వ్యాపారులకు ఏమాత్రం కలిసిరాదు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. 


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


సింహ రాశి
ఈరోజు మీ ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్తు గురించి ఆందోళ చెందడం ఆపివేస్తారు. నేడు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తులతో సమయాన్ని గడపాలని కోరుకుంటారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు రావడంతో ఉత్సాహంగా పనిలో ముందుకు సాగుతారు.  


కన్య రాశి
మీరు చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. మీరు నమ్మదగిన వారితో మీ బాధ్యతలను పంచుకోండి. తద్వారా మీ పనులు వేగంగా, ఏ సమస్య లేకుండా పూర్తవుతాయి. శృంగార పరమైన సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఇది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది. కొన్ని విషయాలలో కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వస్తాయి. 


తులా రాశి
మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి నేడు దూరంగా ఉండాల్సి వస్తుంది. దీనిపై చింతించకండి. కొంత సమయం తరువాత మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మీ సహచరులు ఈ రోజు మీ సూచనలు మరియు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోరు. ఇతరులపై మీ అభిప్రాయాల్ని బలంగా రుద్దడం కన్నా, ప్రతి ఒక్కరి మాట విని ఆలోచించడం శ్రేయస్కరం. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. 


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


వృశ్చిక రాశి
నేడు మీరు సోమరితనంతో పనులు ప్రారంభిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా మీరు కూడా అలాగే భావిస్తారు. అవసరమైతే మీరు పని నుంచి కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం. తల్లిదండ్రులు లేక మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య, సంతృప్తి ఉంటే కూర్చుని వారితో మాట్లాడండి. కుటుంబం మొత్తం ఏకాభిప్రాయానికి రావడం మంచి విషయం. నూతన ఉద్యోగావకాశాలు లబిస్తాయి. ఉద్యోగాలలో మార్పు కోరుకుంటారు.


ధనుస్సు రాశి
ఈ రోజు మీ జీవితంలో కొన్ని అనూహ్య మార్పులు జరగవచ్చు. పరిస్థితికి తగ్గట్లుగా వాటిని మీరు సౌకర్యవంతంగా మార్చుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు మానసిక ప్రశాంతత కరువవుతుంది.


మకర రాశి
మీరు ప్రేమను పొందే సమయం ఆసన్నమైంది. గత కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త అందుకుంటారు. నేడు కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. కొందరు వ్యక్తులు సహాయం కోసం మిమ్మల్ని చేరుకుంటారు. ఉద్యోగులకు పనిలో ఏ ఆటంకాలు ఉండవు. ఆహ్వానాల మేరకు కొన్ని కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి వస్తుంది. 


కుంభ రాశి
ఈరోజు కొన్ని చిన్న విషయాలు మీకు బాధ కలిగించవచ్చు. మీరు సమస్యల్లో చిక్కుకున్న కారణంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ఇది సరైన సమయం కాదు. అవసరాన్ని బట్టి పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటపడాలి. చేసే పనులతో ప్రశంసలు పొందుతారు. కుటుంబం కోసం ఖర్చులు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.


మీన రాశి
కొత్త ఆలోచనలకు మీ మనస్సు తెరిచి ఉంచండి. మీ అభిప్రాయాలపై ఈ రోజు చాలా కఠినంగా వ్యవహరించవద్దు. అయితే, మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు వస్తే కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుంటారు. నేడు మీరు ప్రశాంతంగా మరియు సున్నితంగా ఉండండి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనిచేసే చోట వాతావరణం పూర్తిగా మారనుంది.
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook