Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 05, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వస్తు లాభాలు
Horoscope Today 05 May 2021 | మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 05వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 05 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 05వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు మీ ఉద్యోగం లేదా ఇరత్రా భవిష్యత్తుకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తరువాతి ఐదేళ్ళలో మీరు ఎక్కడ ఉండాలో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళికల కోసం నేడు అధిక సమయం కేటాయిస్తారు.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
వృషభ రాశి
కొంతకాలం నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇందుకోసం ఇతరుల నుంచి సాయాన్ని తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరతాయి. రుణ భారం తగ్గుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఉద్యోగులు పనిలో ముందడుగు వేయనున్నారు.
మిథున రాశి
ఈ రోజు ఇతరులు పారవేసే ఓ వస్తువు కోసం మీరు అన్వేషణ మొదలుపెడతారు. వారికి అవసరం లేనిది మీకు అదృష్టంగా మారనుంది. నేడు మీరు మీ అధికారాన్ని చూపిస్తారు. ఇతరులకు పని అప్పగిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ధ్వనికి సంబంధించి కొన్ని విషయాలు కలిసిరానున్నాయి.
కర్కాటక రాశి
చేయవలసిన పనిపై దృష్టి కేంద్రీకరించాలి. శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఇతరులను నియంత్రణలో ఉంచిన వ్యక్తిగా మీరు చాలా నిబద్ధతను కలిగి ఉంటారు. ఉన్నతాధికారులు ఉద్యోగల శ్రమను గుర్తిస్తారు. ఆర్థిక సమస్యలు పెరగడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
సింహ రాశి
కొంతమంది వారి వద్దకు అందరు రావాలని కోరుకుంటారు. కానీ వారు ఊహించినవన్నీ జరగవని ఆలస్యంగా తెలుసుకుంటారు. సింహ రాశి వారికి వస్తులాబం గోచరిస్తుంది. నేడు మీకు ఆహ్వానాలు అందుతాయి. కష్టమైనప్పటికీ మీరు ఆ కార్యక్రమాలకు హాజరు కావడానికి అంగీకారం తెలుపుతారు. ఎటువంటి సందేహం లేకుండా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
కన్య రాశి
కన్యా రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు పూర్తి చేయడానికి ఓ షెడ్యూల్ సిద్ధం చేసుకుంటారు. కానీ అనివార్య కారణాలతో వాటిని సమయం ప్రకారం పూర్తి చేయడానికి వీలుకాదు. చాలా కాలం నుంచి ధరించని దుస్తులు, వస్తువులు ధరించాలని భావిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం లభిస్తుంది. వ్యాపారులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు కొన్ని విషయాల గురించి ఆలోచించడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు. మిత్రులతో విభేదాలు మిమ్మల్ని బాధిస్తాయి. కొన్ని సందర్భాలలో భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు కుటుంబసభ్యుల మధ్య విభేదాలకు కారణం అవుతాయి.
వృశ్చిక రాశి
మీ సృజనాత్మకత ఇతరులను భయాందోళనకు గురి చేస్తుంది. అయినా ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేయండి. ఇతరులను గుడ్డిగా నమ్మరాదని తెలుసుకుంటారు. మీ సొంత నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనుస్సు రాశి
మీ ప్రవర్తనతో ఇతరులను మీ వద్దకు వచ్చేలా చేసుకుంటారు. కలిసికట్టుగా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చునని భావిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు ఇతరులకు దారి చూపుతాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు సంబంధించి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు అధికంగా శ్రమిస్తే విజయం మీ సొంతం.
Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!
మకర రాశి
మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలి. ఇతరుల విషయాలను పక్కనపెట్టి మీరేం చేయాలనుకుంటున్నారో దానిపై దృష్టిసారించాలి. ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వారు ఏమి చేస్తున్నారో పరిగణనలోకి తీసుకోకండి. పనులు పూర్తి చేసేందుకు రుణాలు తీసుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు.
కుంభ రాశి
చేపట్టిన పనులలో ముందడుగు వేయనున్నారు. మీ సామర్థ్యాలతో ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చునని నిరూపిస్తారు. మిమ్మల్ని బెదిరించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి. చాలా కాలం తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి భారం కానుంది.
మీన రాశి
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వీటిని పక్కనపెట్టి కొన్ని సానుకూల అంశాలపై దృష్టిసారిస్తారు. మీతో అనుబంధం కలిగి ఉన్న సహచరుడు లేదా సహోద్యోగి నుండి సహాయం తీసుకుంటారు. ఈరోజు మీరు ఒంటరిగా ఉండకూడదు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆరోజు ఏమాత్రం కలిసిరాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook