Horoscope Today 06 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 06వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఒకరికి సమస్యలు ఉంటే మీరు విశ్వాసంతో సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు ఫలితాలను గమనిస్తారు. ఈ రోజు కొత్త పనులు చేపట్టడానికి బదులుగా, ఒక అడుగు వెనక్కి తీసుకోండి. గతంలో మీరు ప్రారంభించిన విషయాలపై దృష్టి పెట్టండి. ఉద్యోగాలకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


వృషభ రాశి
ఈ మధ్య మీకు ప్రతి విషయంలో కొంత కొరతగా ఉన్నట్లు అనిపిస్తుంది. అవసరమైన సమయంలో డబ్బు, వస్తువులు కోరుకుంటున్న సమయంలో చేతికి అందనున్నాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.


మిథున రాశి
ఈ రోజు మీ మనసు మాట వినండి. మీ గురించి కొత్త విషయాలను ఇతరులు తెలుసుకోనున్నారు. పనిలో మీ విజయాన్ని తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు గమనిస్తూనే ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పనిని నిలిపివేయకూడదు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు, విభేదాలు తలెత్తుతాయి.


కర్కాటక రాశి 
మీరు జీవితంలో మంచి విషయాలపై దృష్టి పెడితే, ఈరోజు మీకు కలిసొస్తుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. స్నేహితులతో సరదాగా సమయాన్ని గడపుతారు. కొన్ని కొత్త విషయాలు మీకు మేలు చేకూరుస్తాయి. చేపట్టిన పనులలో విజయం అందుకుంటారు. 


సింహ రాశి
మీ శ్రద్ధగల స్వభావం ప్రజలను మీతో స్నేహం చేసేలా చేస్తుంది. కానీ ఇది మీ కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. మీరు ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నారు. బంధువులు, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడపనున్నారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


కన్య రాశి
ప్రతిదీ పరిపూర్ణంగా ఉండదని మీరు గ్రహించాలి. ప్రతి విషయంలోనూ అందరికీ విజయాలు దక్కవని తెలుసుకుని ముందుకుసాగాలి. ఈ రోజు పనులు బాగా చేసినా సంతృప్తి పొందకపోవచ్చు. మీ తల్లిదండ్రులపై దృష్టిసారించాలి. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం ఇది. ఆకస్మికంగా ఖర్చులు చేయాల్సి రావడంతో రుణాల కోసం యత్నిస్తారు.


తులా రాశి
మీరు ప్రతి విషయంలో క్రమశిక్షణ పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. ఇళ్లు, ఆఫీసులో డెస్కులను శుభ్రం చేసే పనులు చేపడతారు. మీ కోసం చేయవలసిన పనుల జాబితాను రూపొందించండి, వెంటనే చేయాల్సిన పనులను మొదలుపెడతారు. యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ప్రశాంతత కోల్పోతారు.


వృశ్చిక రాశి
ఇది మీకు కీలకమైన సమయం, కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే పని చేయండి. మీకు ఈ రోజు నిజంగా అదృష్టం కలుగుతుంది. మీకు కావలసిన విషయాలు మీ ప్రమేయం లేకుండా మీకు చేరనున్నాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.


Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 


ధనుస్సు రాశి
మీరు సాహసోపేత విషయాల నుండి దూరంగా జరగనున్నారు. మనసు చెప్పే మాటను సైతం వినాలని లేకపోతే కష్టాలు తప్పవని గ్రహిస్తారు. ముఖ్యంగా బయట ఉన్న పరిస్థితులతో మీకు కావలసిన వాటి కోసం ఆలోచిస్తారు. నాయకత్వం వహించడానికి యత్నిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది.


మకర రాశి
ఎవరైనా మీ పట్ల ఆసక్తి చూపిస్తుంటే, వారికి దూరంగా జరగకూడదు. మీరు దానిని అంగీకరించే సమయం ఇది. తీరిక లేకపోతే ఎలాగైనా ఈరోజు విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. స్నేహితులు, బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది..


కుంభ రాశి
సంగీతం చాలా విషయాలకు పరిష్కారం కానుంది. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండటానికి కొన్ని ఆధ్యాత్మిక సంగీతాన్ని ఆస్వాదిస్తారు. కొంతకాలం నుంచి మీరు మాట్లాడని స్నేహితులను కలుసుకుని వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఖర్చులు బారం కానున్నాయి. అయితే శ్రద్ధ వహించకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.  


Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి


మీన రాశి
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ మనసులో మాటను వ్యక్తం చేయడానికి ఇది చాలా మంచి రోజు. పనిలో మీ ఆలోచనలను మీ ఉన్నతాధికారులతో నేరుగా పంచుకుంటే మంచిది. తద్వారా మీరు ఏమి చేస్తున్నారో వారికి అర్థమవుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook