Today Horoscope In Telugu 07 May 2021: నేటి రాశి ఫలాలు మే 07, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధన లాభం
Today Horoscope In Telugu 07 May 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 07వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి.
Horoscope Today 07 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 07వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈరోజు మీ మొండి పట్టుదల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు వివాదాలకు దారితీయకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీకు అప్పగించిన ఆస్తి చివరికి మీకు ఇవ్వబడుతుంది. విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే
వృషభ రాశి
నేడు ఎవరికైనా మీ సహాయం అవసరం కావచ్చు, కనుక మీకు వీలైనంతలో వారికి సహాయం చేసి ఆదుకుంటారు. మీరు గొప్ప శ్రేయస్సును కలిగి ఉండటానికి మీ జీవన విధానంలో మార్పులను కోరుకుంటారు. సహోద్యోగులు పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు ఏకాభిప్రాయానికి రానున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితలు అందుతాయి.
మిథున రాశి
మార్పు కోసం మీ ఇంట్లో కొన్ని విషయాలలో సర్దుబాట్లు చేసుకుంటారు. ఈరోజు ఆస్తి సమస్య జోలికి వెళ్లడం శ్రేయస్కరం కాదు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అంత లాభసాటిగా ఉంటుంది.
కర్కాటక రాశి
దంపతులు గొడవ పడటం వలన ఇంట్లోని పెండింగ్ పనులు మీపై ఒత్తిడి పెంచుతాయి. విద్యార్థులు తమ కెరీర్, ఉన్నత చదువుల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాలలో కొందరు శుభవార్త అందుకుంటారు.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
సింహ రాశి
చాలా రోజుల తరువాత కొందరు వ్యక్తులు మిమ్మల్ని కలుసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కనుక ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాటిని ప్రస్తుతం వాయిదా వేసుకోండి. వ్యాపారులు స్టాక్స్ మరియు షేర్ల నుండి లాభాలు పొందుతారు.
కన్య రాశి
ఈరాశి వారు నేడు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొందరు ఆశించిన విధంగా డబ్బు సంపాదిస్తారు. నైపుణ్యం ఉన్న వారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కుటుంబ మద్దతుతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి.
తులా రాశి
నేడు బంధువులు, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. కరోనా కారణంగా కొన్ని శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునేందుకు తీర్థయాత్రలకు ప్లా్న్ చేస్తారు. మీకు అంతగా ఉపయోగపడని వస్తువులను కొనుగోలు చేయవద్దు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతారు. దాని వల్ల మీరు ఏ ఒత్తిడి, ఆందోళన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో కొందరు అనారోగ్యానికి గురవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
ధనుస్సు రాశి
మీరు కొత్త ప్రాంతానికి మకాం మార్చాలని నిర్ణయించుకుంటారు. మరియు దానివల్ల మీకు అదృష్టం కలగనుంది. గతంలో చేసిన పెట్టుబడులు వ్యాపారులకు లాభాలు అందిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. మీ ఆలోచనలు నిమిషం నిమిషానికి మారుతూ ఉంటాయి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి.
మకర రాశి
కొన్ని అదనపు కార్యకలాపాలను పూర్తి చేయడానికి టూర్ షెడ్యూల్ చేయవచ్చు. ఈ సమయంలో ప్రయాణాలు శ్రేయస్కరం కాదని కొందరు మిమ్మల్ని హెచ్చరిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి
మీరు ఇంట్లో కొన్ని మార్పులను చేయాలని ప్లాన్ చేయవచ్చు. ఖర్చులు అధికం అవుతున్నాయని మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. స్టాక్స్ మరియు షేర్ల నుండి వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఖర్చులు కుటుంబంలో వివాదాలకు కారణం అవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం.
మీన రాశి
మీరు చేసే పనిని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉంటారు. కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పనిలో ప్రమోషన్, అదనపు బాధ్యతలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలాలు అందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook