Horoscope Today 10 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 10న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీకు ఇష్టమైన వారితో ఏకాంతంగా గడుపుతారు. మీకు నేడు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన విషయాలను కొన్ని రోజులు పక్కన పెట్టే సూచన. ప్రేమను పొందేందుకు తాపత్రయపడతారు.


వృషభ రాశి
మీరు ఈరోజు నాయకత్వ నైపుణ్యాలపై  అవగాహన పెంచుకుంటారు. చుట్టుపక్కల ప్రజలను ఇష్టపడాలని మీరు కోరుకుంటారు. ఓ జట్టును నడిపించే ప్రతిభ మీ సొంతం. ఈ విషయాన్ని మీరు ఉపయోగించాలని యత్నిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసి మీ బృందానికి నాయకత్వం వహించండి, మేలు చేసేందుకు యత్నాలు ఫలిస్తాయి.


Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం


మిథున రాశి
మీరు డబ్బు ఆదా చేయడం ప్రారంభించాలి. లెక్కకు మించి ఖర్చులతో వ్యయప్రయాస గోచరిస్తుంది. మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. నేడు ఆహారం మరియు గ్యాస్ వంటి ఇంటి అవసరాలకు మాత్రమే ఖర్చులు శ్రేయస్కరం.


కర్కాటక రాశి
ఈరోజు మీలో ఏదో ప్రతికూల ఆలోచనలు వస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి చెడ్డ రోజులు వస్తాయి. కానీ ఏది శాశ్వతంగా ఉండదని గ్రహిస్తారు. ఈ రోజు మీకు అంతగా లాభించకపోయినా, జీవితంలో మంచి విషయాలపై దృష్టి పెట్టండి.


సింహ రాశి
సమయానుసారం మీ బాధ్యతలు మారుతాయి. మీ కార్యాలయంలో కొత్త వ్యక్తులతో మీకు కొంచెం అభద్రత భావం. ఇతరులకు మీరు కోరుకున్న నాయకత్వం లభిస్తుంది. ఏ విషయాలపై చింతించకూడదు. కేవలం మీ లక్ష్యంవైపు ముందుకు సాగాలి.


కన్య రాశి
మీపై శ్రద్ధ లేదని చిరాకు పడతారు. కోపం కారణంగా ఇతరులు మీకు దూరమయ్యే సూచన గోచరిస్తుంది. కొందరు పట్టించుకోకపోతే మీకు ఏ నష్టం లేదని గ్రహిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అందరితో కలుపుగోలుగా ముందుగు సాగుతారు. ఈరోజు మీకు ఓ శుభవార్త.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ


తులా రాశి
ఇతరుల అవసరాలకు తగినట్లుగా మార్పులు. దానివల్ల మీకు ప్రయోజనం గోచరించడం లేదు. ఇది మీకు అసౌకర్యాన్ని కల్పిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి నుంచి అరుదైన గౌరవం. మీరు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తారు. మీకు ఈరోజు అదృష్టం వరించనుంది. 


వృశ్చిక రాశి
మీ శ్రమ, ప్రయత్నాలు వెలుగులోకి వస్తాయి. మీ పని వేరే వారికి పేరు తెచ్చే సూచన. అయితే మీరంటే ఏంటో అందరికీ తెలిసిలా చేయడంలో సఫలం అవుతారు. ఇకనుంచి వచ్చిన ప్రతిఫలాన్ని మీరు చేసినట్లు పై అధికారులకు స్పష్టంగా చెబుతారు. మీకు అంతా శుభం జరుగుతుంది. తగిన గౌరవం దక్కుతుంది. 


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


ధనస్సు రాశి
ఈ రోజు ధనస్సు రాశి వారు పలు విషయాలలో  రాజీ పడతారు. మీ పనులను కచ్చితంగా చేయాలని పట్టుబట్టడంతో ఘర్షణ, వివాదాలు గోచరిస్తున్నాయి. అయితే ఇతరులు ఏం చెబుతున్నారో విని అంగీకరించే సమయం ఇది. భవిష్యత్తులో ఎలాంటి గొడవలు వద్దు అనుకుంటే ఈరోజు మీ ఆలోచల్ని ఎవరిపై రుద్దవద్దు


మకర రాశి
మీరు అందరి దృష్టిని కోరుకుంటున్నారు. గతానికి చాలా భిన్నంగా ఆలోచిస్తారు. దీని గురించి తరువాత ఏ భయం వద్దు. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో గుర్తింపు కోరుకుంటారు. కొందరితో రహస్య చర్చలు జరుపుతారు.


కుంభ రాశి
మీ భావాలను ఎవరైనా పట్టించుకోనందున మీరు ఉద్రిక్తంగా మారతారు. అవతలి వారు కేవలం వారి గురించి ఆలోచించడం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ఈ విధంగా ఆలోచించవద్దు. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. కుటుంబంతో సమయం గడుపుతారు.


మీన రాశి
కాస్త సోమరితనంగా ఉంటారు. ఏ పనులు చేయకూడదు అనుకుంటారు. కానీ ఈరోజు మీకు పని అవసరం. ఉద్యోగానికి వెళ్లి, మీ సహోద్యోగులకు అవసరమైన విషయంలో సహాయం చేస్తారు. మీ శ్రమ వల్ల టీమ్ సంతోషంగా ఉంటుంది. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.


Also Read: Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook