Horoscope Today 10 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 10వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీరు సాధించడానికి సాధ్యం కానిది ఉండదు. ఓ యోధుడిలా పోరాడతారు. మీ ఆలోచనలు మరియు అభిప్రాయాలను ఆఫీసులో మరియు ఇంట్లోనూ గౌరవిస్తారు. మీ ఉత్పాదకత ఈ రోజు గరిష్టంగా ఉండనుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభించనుంది. వ్యాపారులు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది.


Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే


వృషభ రాశి
ఈ రోజు మీ స్నేహితులను కలుసుకునేందుకు వెళ్లనున్నారు. వారికి మీపై నమ్మకం మరింత పెరుగుతోంది. సలహాలిచ్చే ముందు అవతలి వ్యక్తుల భావోద్వేగాలను అర్థం చేసుకోండి. మీ విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. నూతన ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. 


మిథున రాశి
మీ చుట్టుపక్కల వ్యక్తులు అందరూ మంచివారని మీరు నమ్ముతారు. ప్రతి ఒక్కరూ మీ నిర్ణయాలు, అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అయితే ప్రతి విషయాన్ని మీ నెత్తిపై వేసుకోకూడదని తెలుసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. 


కర్కాటక రాశి 
మీరు మీలాగే ఉండాలి. ఇతరుల మెప్పు పొందేందుకు మీరు మారాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల వాళ్లు మిమ్మల్ని మీలాగే ప్రేమిస్తున్నారని గ్రహించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


సింహ రాశి
ఈరోజు మీరు ఇంట్లోనే ఉండాలని భావిస్తారు. బయటకు వెళ్లి పని చేసేందుకు ఆసక్తి చూపరు. ఇంట్లో కూర్చుని మీకు ఇష్టమైన వ్యక్తులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. వేసవికాలం కావడంతో, వేడి మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మానసిక ప్రశాంతత కోసం మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఆదాయం విషయంలో కుటుంబంలో విభేదాలు వస్తాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి.  


కన్య రాశి
నేడు కొన్ని పనులు పూర్తి చేసేందుకు మీరు ఇంట్లోనే ఉంటారు. మీ నైపుణ్యాలతో సమస్యలను సులువుగా అధిగమిస్తారు. అయితే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల కారణంగా కొత్తగా రుణాలు చేయాల్సి వస్తుంది. మరోవైపు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.


తులా రాశి
ఈ రోజు పనిచేసే చోట మీకు అంతా శుభం జరుగుతుంది. మీ కార్యాలయంలో మీ ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటారు మరియు మీ సహోద్యోగుల ప్రశంసలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులు మరిన్ని పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంటారు. కొందరు వ్యక్తులు పరిచయంతో మీ పనులలో వేగం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి చేతికి అందాల్సిన నగదు లభిస్తుంది.


వృశ్చిక రాశి
మీకు తెలియని మీ గురించి మీరు తెలుసుకుంటారు. ఇప్పటివరకూ మీరు పట్టించుకోని విషయాలపై అవగాహణ పెంచుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. మీ మాటతీరు, వ్యవహారశైలి కారణంగా సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తారు. 


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


ధనుస్సు రాశి
నేడు కొన్ని అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. వాటికి మీరు నో చెప్పడానికి బదులుగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత సమయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించుకోండి. ముఖ్యమైన పనులపై దృష్టిసారించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు నేడు అంతగా కలిసిరాదు.


మకర రాశి
గతంలో చేసిన అప్పులు తీర్చేందుకుగానూ కొత్తగా వేరేచోట రుణ యత్నాలు మొదలుపెడతారు. ఓ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు స్థలాన్ని కేటాయిస్తారు. అయితే ప్రయాణాలు చేస్తేనే అవకాశం సద్వినియోగం అవుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు చేతికి అందవు. 


కుంభ రాశి
ఓ స్నేహితుడు సలహా కోసం మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీకు తోచిన విషయాలు చెప్పి అతడికి సహకరించాలని భావిస్తారు. పనిచేసే చోట ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని అనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఇంటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మీన రాశి
చేపట్టిన కార్యక్రమాలు మధ్యలోనే వాయిదా వేస్తారు. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు పని చేసే చోట ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మరియు ప్రమోషన్ కూడా లభించవచ్చు. కొన్ని విషయాలు మీకు చికాకు తెప్పిస్తాయి.


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook