Horoscope Today 11 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 11వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
మీరు ఈ రోజు ఆందోళనలో ఉన్నారు. ఈ స్థితిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అవసరమైతే మీరు ఇతరులను సహాయం కోరండి. తద్వారా మీ పని తేలిక అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలు తలుపు తట్టనున్నాయి. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి రానున్నాయి.


Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే


వృషభ రాశి
ఈ రోజు మీరు పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం ఒకట్రెండు పనులు పూర్తి చేయడం కంటే, ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్య ఇవ్వాలి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. 


మిథున రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. డబ్బుకు సంబంధించి కొన్ని తప్పిదాలు చేయనున్నారు. ఖర్చు చేయడానికి ముందు జమ చేయడం తెలుసుకోండి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించవచ్చు. మీ కెరీర్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 


కర్కాటక రాశి 
నేడు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు. ఏం జరిగినా సరే నిజాయితీగా ఉండండి. మీరు మరియు మీ సహోద్యోగులను ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడకూడదు. డొంకతిరుగుడు సమాధానాలతో ప్రయోజనం ఉండదు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. 


సింహ రాశి
ఈ రోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. మధ్యాహ్నం ఓ యాత్రను ప్లాన్ చేయాలనుకోవచ్చు. తద్వారా మీకు అవసరమైన విరామం దొరుకుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. వ్యాపారులకు పెట్టబుడులు నిరాశ కలిగిస్తాయి.  


Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos


కన్య రాశి
కుటుంబంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. నాలెడ్జ్ ఉన్న వారికి కెరీర్ పరంగా అవకాశాలు లభిస్తాయి. ఇతరులతో కలిసి కొత్త ప్రాజెక్టులు చేపడతారు . వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.


తులా రాశి
నేడు మీకు కాలం కలిసిరానుంది. మీరు సరదాగా మరియు ఉల్లాసంగా ఉంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. స్నేహితులతో కలిసి పార్టీ లేక ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారు.


వృశ్చిక రాశి
గత కొన్ని రోజులుగా విరామం లేకుండా పనిచేస్తున్నారు. కనుక ఈరోజు పని నుండి మీరు విరామం తీసుకోవాలి. వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోవడానికి ఇది తగిన సమయం. ఈ రోజు మీకు కావలసినది చేయడానికి సమయం దొరుకుతుంది. ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది. 


ధనుస్సు రాశి
ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సమస్యలను పరిష్కరించడానికి మీ విశ్వాసం సహాయం చేస్తుంది. ఇంట్లో మీకు కొంత బాధ్యత అప్పగించవచ్చు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. 


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


మకర రాశి
ప్రజలు మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనిస్తున్నారు. సన్నిహితులు మీ నుండి దూరం కావాలని ప్రయత్నిస్తారు. స్నేహితుడి నుండి సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. పనులు నత్తనడకన సాగుతాయి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. వ్యాపారులకు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు పనిపై ఏకాగ్రత లేకపోతే సమస్యలు తప్పవు. 


కుంభ రాశి
కొన్ని విషయాలు కలిసి రావడంతో గాల్లో తేలుతున్నారు. అయితే మీ పద్ధతి మార్చుకోవడానికి ఇది తగిన సమయం. ఆత్మవిశ్వాసం మంచిది, కాని అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలు సైతం తెలుసుకుని వారి మాటను గౌరవించాలి. 


మీన రాశి
మీ జీవిత భాగస్వామిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని గొడవలు జరుగుతాయి. కనుక వారికి సమయం కేటాయించాలి. ధన వ్యయం కారణంగా రుణాలు చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook