Horoscope Today 14 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 14వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తారు. సృజనాత్మకత వైపు అడుగులు వేయనున్నారు. మరియు పనిలో కొత్త ఆలోచనలు మీ మనస్సులోకి వస్తాయి. మీ ఇంట్లో వస్తువులను మార్చాలని ప్లాన్ చేస్తారు. ప్రేమికులు టూర్ ప్లాన్ చేసుకుంటారు. కానీ జాగ్రత్తగా వ్యవహరించపోతే అనర్థాలు తప్పవు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది.


Also Read: Ugadi 2021 Wishes: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి


వృషభ రాశి
ఇంట్లో సమస్యలతో మీరు సతమతమవుతున్నారు. మీరు ఇష్టపడే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలను పరిష్కరించడానికి యత్నిస్తారు. అనవసర ఖర్చును నియంత్రించడానికి ప్రయత్నించండి. పనిలో మీకు అప్పగించిన కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తీరిక లేకుండా గడుపుతారు. ఖర్చులు పెరగడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


మిథున రాశి
మీ ఆలోచనా విధానం ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. పనిలో నిజమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ యజమానులు మీ పనిని గుర్తిస్తారు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో విలాసవంతమైన విందు, వినోదాలతో గడపాలని కోరుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


కర్కాటక రాశి 
పనిలో ఓ పెద్ద సమస్య ఈ రోజు మిమ్మల్ని భయపెడుతుంది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్దమవ్వాలి. అధ్యయనం చేసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నూతన ఉద్యోగావకాశాలు మీ చేతికి అందుతాయి. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉండనుంది.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


సింహ రాశి
ఈ రోజు మీ కెరీర్‌లో అదనపు సానుకూలత కనిపిస్తుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు మునుపటి పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. మీకు సాయం చేసేందుకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు.


కన్య రాశి
మీ భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడిని ప్లాన్ చేయండి. కెరీర్ మారాలనుకుంటే అందుకు తగిన సమయం ఇదేనని భావిస్తారు. మీ కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. రుణ యత్నాలు మళ్లీ మొదలుపెడతారు.


తులా రాశి
ఆఫీసులో కష్టపడి పనిచేసినందుకు మీకు రివార్డ్ లభించనుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా కళారంగాల వారికి ఆశించిన ఫలితాలు రానున్నాయి. మీ పిల్లలపై అధిక శ్రద్ధ వహించాల్సిన పరిస్థి ఏర్పడుతుంది.


వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఉద్యోగంలో మీరు సంతృప్తి చెందుతారు. మతపరమైన ప్రదేశాలు దర్శించుకోవాలని మనసులో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రాబోయే కొద్ది నెలలు ప్రణాళికపై దృష్టిసారించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.


ధనుస్సు రాశి
మీకు పనిలో చికాకులు తలెత్తుతాయి. కానీ ఇంటి నుంచి సహకారం అందుతుంది. తద్వారా మీరు సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. డబ్బుకు సంబంధించి నిర్లక్ష్యం వహించరాదు. ఎక్కువ ఖర్చు చేయకపోవడమే మంచిది.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


మకర రాశి
కొంత ప్రభావవంతమైన వ్యక్తి మీకు స్ఫూర్తినిస్తారు. అవసరమైతే మీకు ఉద్యోగం కూడా ఇస్తాడు. ప్రేమ కోసం తపిస్తుంటారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఉద్యోగుల శ్రమకు తగ్గ గుర్తింపు కోసం పోరాడుతారు.


కుంభ రాశి
మీరు ఈ రోజు పనిలో తీరిక లేకుండా ఉంటారు. మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తుంది. మీకు వ్యాపారస్తులైతే ఈ రోజు మీరు విజయవంతమైన పెట్టుబడిదారులను కలుసుకుంటారు. తద్వారా మీకు లాభసాటిగా మారనుంది. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానం అందుతుంది. ఉద్యోగుల శ్రమను యాజమాన్యం గుర్తిస్తుంది.


మీన రాశి
ఈ రోజు మీ గురించి స్వయంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నతాధికారులు మీ నుంచి అధికంగా పనిని ఆశిస్తారు. మరోవైపు కుటుంబం మీతో సమయం గడపాలని భావిస్తుంది. ఇది కొంత ఘర్షణను సృష్టించే అవకాశం ఉంది. ఈ రోజు పెట్టుబడులకు లాభాలు ఆశించవచ్చు. కానీ జాగ్రత్త వహించకపోతే నష్టాలు సైతం గోచరిస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook