Horoscope Today, 15 December 2021: Check astrological prediction : ప్లవ నామ సంవత్సరం..డిసెంబర్ 15, 2021 బుధవారం రాశి ఫలాలు, తిథి నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి. 
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 11. 
పుర్నిమంతా - 2078, మార్గశిరము 26.
అమాంత - 2078, మార్గశిరము 11. 
తిథి - శుక్లపక్షం ద్వాదశి , శుక్లపక్షం త్రయోదశి. నక్షత్రం ‌‌- భరణి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - ఉదయం 6:42 
సూర్యాస్తమానము - సాయంత్రం 5:40
చంద్రోదయం - సాయంత్రం 3:04 
చంద్రాస్తమయం - ఉదయం 4:05


అననుకూలమైన సమయం
రాహుకాల - మధ్యాహ్నం 12:11 – 1:33
యమగండం - ఉదయం 8:04 – 9:26 
గుళికా - ఉదయం 10:48 – మధ్యాహ్నం 12:11
దుర్ముహూర్తం - ఉదయం 11:49 – మధ్యాహ్నం 12:33
వర్జ్యం - మధ్యాహ్నం 03:26 – సాయంత్రం 05:14.


శుభ సమయం
అమృతకాలము - ఉదయం 02:12 – 04:00
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:06 – 05:54. 


ఇక వివిధ రాశుల ప్రకారం వారి దినఫలాలు ఈ విధంగా ఉండనున్నాయి. 


మేషరాశి (Aries)


ఈ రాశి వారికి డబ్బుపరంగా, వృత్తిపరంగా కలిసొస్తుంది. ఈ రోజు మేషరాశి వారికి కాస్త లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మేషరాశికి అనుకూలమైనది. మీరు ఇవాళ కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ రోజు సాయంత్రంలోగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ఈ రోజు బాగానే కలిసొస్తుంది. ఈ రాశి ఇవాళ పట్టిందంతా బంగారమే అవుతుంది. డబ్బు పరంగా ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుంది.


వృషభ రాశి (Taurus)


ఈ రోజు మీరు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఎవరిపై కైడా కోపం చూపించకండి. దీంతో మీ ప్రతిష్టను దెబ్బతినే అవకాశం ఉంది. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. డబ్బు సంబంధిత లావాదేవీల్లో మీకు చిన్నపాటి అవాంతరాలు ఏర్పడుతాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.


మిథున రాశి (Gemini)


మిథున రాశి వారిని ఈ రోజు పలు విషయాల్లో అదృష్టం వరిస్తుంది. అంతేకాదు..ఇవాళ మీకు అంతా అనుకూలంగానే జరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. అలాగే మీరు ఇవాళ కొన్ని పనుల్లో వ్యూహాలను అనుసరిస్తే మేలు. మీకు ఇవాళ ఆర్థికంగా కూడా కలసి వస్తుంది.


కర్కాటక రాశి (CANCER) 


ఈ రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి డబ్బు విషయంలో కాస్త ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్లే డబ్బు విషయంలో కాస్త ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. అయితే చాలా రోజులుగా వేచి చూస్తోన్న ఒక వ్యవహారంలో మీకు ఈ రోజు మంచి జరుగుతుంది. అలాగే మీరు ఇవాళ ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా కొనే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.


సింహరాశి - LEO


సింహరాశి వారు ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న కొన్ని వివాదాలను ఇవాళ వీలైనంత వరకు పరిష్కరించుకోవడం మేలు. ఇప్పటికే మీరు కొన్ని విషయాల్లో చాలా ఆలస్యం చేసి ఉంటారు. ఇక వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించుకోండి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కాస్త మీ ఆర్థిక పరిస్థితిని కూడా ముందడుగు వేయండి.


Also Read : Personality by Date of Birth: ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లైన తర్వాత పట్టపగలే చుక్కలు కనిపిస్తాయట!!


కన్య రాశి - VIRGO


మీరు ఏదైనా పరీక్ష లేదా ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతున్నట్లయితే ఈ రోజు మీకు చాలా మంచిది. మీరు చేపట్టబోయే పనిలో విజయం సాధిస్తారు. కుటుంబం నుంచి కొందరు ఇవాళ మీకు ఆర్థిక సహాయం చేస్తారు. డబ్బు విషయంలో మీకు ఈ రోజు మంచి లక్కీ డే.


తులరాశి - LIBRA


మీరు ప్రారంభించిన కొన్ని పనుల ద్వారా మీ సమయం, డబ్బు వృథా అయ్యే అవకాశం ఉంది. తులరాశిలో ఉద్యోగులు, వ్యాపారులు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 


వృశ్చికరాశి - SCORPIO


మీ వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మిమ్మల్ని ఎవరైనా మతపరమైన ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి.


ధనస్సు రాశి - SAGITTARIUS


మీ వ్యాపారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎక్కువగా చర్చలు జరపకండి. మీరు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగు వేయండి. ఇక ఎవరని ఎక్కువగా నమ్మకండి.. మిమ్మల్ని మోసం చేసే అవకాశాలుంటాయి.


మకర రాశి - CAPRICORN


ఈ రోజు డబ్బు పరంగా లేదంటే ఖర్చుల విషయంలో మకరరాశి వారు కాస్త ఇబ్బందులకు గురి అవుతారు. కొన్ని విషయాల్లో చిన్నపాటి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎక్కడైనా డబ్బు వెచ్చించాల్సి వస్తే.. మీ ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఖర్చు చేయడం మంచిది.


కుంభ రాశి‌‌ - AQUARIUS 


ఈ రోజు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఎన్నో రోజులుగా కోరుకుంటున్న కొన్ని ప్రత్యేక కోరికలు ఇవాళ నెరవేరుతాయి. అలాగే మీకు బాగా నచ్చే వ్యక్తులను అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంటుంది. 


మీనరాశి (PISCES) 


మీనరాశి వారు కొన్ని విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాగే మీరు ఏ విషయంలో కూడా భయపడకండి. మీరు ఈ రోజు ఏదైనా పని చేసే ముందు కాస్త అన్ని విధాలుగా ఆలోచించండి. అలా ఆలోచించి ముందడుగు వేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.


Also Read : Rajnath Singh: 1971 నాటి యుద్ధ వీరుడి భార్య పాదాలకు నమస్కరించిన రాజ్‌నాథ్ సింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook