Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 17, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి గృహయోగం
Today Horoscope In Telugu 17 May 2021: మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 17వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 17 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 17వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
సాధారణంగా మీ భావాలను దాచడానికి ఇష్టపడతారు. అయితే, ఈరోజు మీ భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి తగిన సమయం. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రయాణాలు లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడుల జోలికి వెళ్లరాదు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి.
Also Read: Kumbhmela: కుంభమేళా ప్రభావం..ఒకే కుటుంబంలో 33 మందికి కరోనా పాజిటివ్
వృషభ రాశి
నేడు మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే వెనకడుకు వేయకుండా ధైర్యంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ అద్భుతమైన పని నైపుణ్యాలు మీకు నాయకత్వం వహించడానికి సహాయపడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
మిథున రాశి
ఈరోజు బయట అధిక సమయం గడపుతారు. ఇది మీకు స్పష్టంగా ఆలోచించడంలో సహాయపడుతుంది. మీ భిన్నమైన ధోరణిని గమనించిన వారు ఆశ్చర్యానికి లోనవుతారు. అప్పుల బాధ పెరుగుతుంది. అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి
గత కొంతకాలం నుంచి మీరు మాట్లాడని వ్యక్తులను సంప్రదించడానికి నేడు కొంత సమయం కేటాయించి సంప్రదింపులు జరుపుతారు. ఈరోజు ఓ శుభవార్త అందుకుంటారు. ఆ వార్త మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉండనుంది.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
సింహ రాశి
ఈ రోజు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. కానీ ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. మీ చుట్టుపక్కల వారి సలహాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు పనిలో ఒత్తిడి అధికం కానుంది. ఆచితూచి వ్యవహరించకపోతే వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
కన్య రాశి
కన్యారాశి వారు ఈరోజు అధికంగా ఖర్చు చేయడం మానుకోవాలి. మీ ఆర్థిక స్థితి బాగుందని ఖర్చులకు వెనుకాడరు. కానీ భవిష్యత్తులో ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కనిపించిన ప్రతి వస్తువుపై పెట్టుబడి పెట్టడానికి బదులుగా ఆచితూచి వ్యవహరించాలి.
తులా రాశి
మీరు లక్ష్యంగా ఎంచుకున్న ప్రతి పని నేడు నెరవేరనున్నాయి. అందుకోసం మీరు మరింతగా శ్రమించక తప్పదు. నేడు మీకు వాహనయోగం లేదా గృహయోగం. విక్రయాల విషయంలో కొన్ని ఒప్పందాలపై సంతకం చేస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చిక రాశి
మీ చుట్టూ ఉన్నవారు మీ అధికారాన్ని, పనితనాన్ని సవాలు చేసే అవకాశం ఉంది. హోదా నుంచి తప్పుకోవాలని బెదిరింపులు ఎదుర్కొంటారు. మీరు మంచికారు కావడం అనేది మీకు తలనొప్పిగా మారనుంది. కనుక వెనక్కి తగ్గకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో మార్పులు కోరుకుంటారు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
ధనుస్సు రాశి
పనులు పూర్తి చేయడానికి నేడు పలువురు వ్యక్తులను కలుసుకుని మాట్లాడాల్సి వస్తుంది. అదే సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. కొందరు మీతో పలు విషయాలు చర్చించాలని భావిస్తారు. మీ పనులు పూర్తి చేయడానికి అధికంగా శ్రమించక తప్పదు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
మకర రాశి
మీరు స్నేహితుల నుండి కాస్త దూరంగా జరుగుతారు. గత కొంతకాలం నుంచి మీతో మాట్లాడని వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ అసలైన స్నేహితుడికి సమస్య ఉంటే వారికి సహాయం అందించడానికి సిద్ధపడతారు. ఉద్యోగులకు పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు అందుతాయి.
కుంభ రాశి
నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. మీరు భవిష్యత్తుపై దృష్టిసారించాలా వద్దా అని అయోమయంలో ఉన్నారు. అందుకు ఇది తగిన సమయం కాదని తగ్గుతారు. నేడు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మీన రాశి
నేడు మీరు తీరికలేని పనులతో గడుపుతారు. కుటుంబసభ్యులు, స్నేహితులు మీరు తమకు కేటాయించాలని, కొద్ది సమయం గడపాలని భావిస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. తద్వారా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook