Kumbhmela: కరోనా సంక్రమణ దేశంలో ఇంకా కొనసాగుతోంది. రోజూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఉత్సవాలు, వేడుకలతో సంక్రమణ ఉధృతమవుతోంది. కుంభమేళా ప్రభావం..ఒకే కుటుంబంలో 33 మందికి కరోనా సోకింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి జనం అల్లాడిపోతున్నారు.కరోనా విపత్కర పరిస్థితులు వణికిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడంతో సంక్రమణ ఆగడం లేదు. ఉత్సవాలు, వేడుకలు నిర్వహిస్తూ కోవిడ్ వ్యాప్తిని పెంచుతున్నారు. కుంభమేళా ప్రభావం(Kumbhmela) దేశంలో కరోనా సంక్రమణకు ప్రధాన కారణమే వాదన ఇప్పటికే ఉంది. కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ..ఏకంగా 33 మందికి కరోనా వైరస్ అంటించింది. బెంగళూరుకు చెందిన 67 ఏళ్ల మహిళ ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళాలో పాల్గొంది. తరువాత కొద్దిరోజులకే ఆమెలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా నిర్ధారణ పరీక్ష (Covid19 Test) చేయించగా..పాజిటివ్‌గా తేలింది. ఆమెతో పాటు కుటుంబంలో మరో 18 మందికి కరోనా సోకింది.
ఈ మహిళ కోడలు వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్ కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. దాంతో ఆమె ద్వారా సెంటర్లో ఉన్న మరో 13 మందికి కరోనా సోకింది. దాంతో కుంభమేళాకు వెళ్లివచ్చిన మహిళ నివాసంతో పాటు పరిసరప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
Also read: Delhi Status: ఊపిరి నుంచి కోలుకుంటున్న ఢిల్లీ, తగ్గుముఖం పట్టిన కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook