Horoscope Today 18 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 18వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీ కాళ్ల మీద నిలబడేందుకు యత్నిస్తారు. మీకు కొన్ని క్లిష్ట పరిస్థితులు సవాలుగా మారనున్నాయి. కొన్ని ప్రశ్నలకు మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. దీని కోసం మీరు వేగంగా ఆలోచించి సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఖచ్చితంగా మీకు సహాయపడతాయి. కానీ, ఏదైనా చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


వృషభ రాశి
ఈ రోజు మీరు ప్రేమ కోసం తపిస్తున్నారు. మీ జీవిత భాగస్వామి సంకేతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా, అయితే మీకు నేడు అందుకు మార్గం ఏర్పడుతుంది. ఖర్చులు అధికం కానున్నాయి. తద్వారా బంధుమిత్రుల నుంచి మీకు మాటపట్టింపులు రానున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు గోచరించడం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.


మిథున రాశి
మీ ఆరోగ్యం ఈ రోజు మెరుగవుతుంది. మీ మనసు ఉత్సాహంతో ఉరకలు వేయనుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇకనుంచి వ్యాయామం, యోగా లాంటి శారీరక శ్రమ చేయాలి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 


కర్కాటక రాశి 
నేడు మీరు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. మీ కెరీర్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు తగిన సమయం ఇది. కెరీర్ విషయంలో కొందరి సహాయం అందుకుంటారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


సింహ రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులకు సహాయం చేయడానికి మీ రోజు నుండి కొంత సమయం కేటాయిస్తారు. లేదా అవసరమైన స్నేహితుడికి సహాయం చేయండి. మీరు అభివృద్ధి చెందడానికి నేడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.  


కన్య రాశి
నేడు మీరు సృజనాత్మకతను ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మీ మెదడు అసాధారణంగా పనిచేస్తుంది. మీ కార్యాలయంలో కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలతో ముందడుగు వేయనున్నారు. ఇతరులపై నోరుపారేసుకోవద్దు. మీ ఆలోచనలను మీ సహోద్యోగులతో పంచుకోండి. దైవదర్శనాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నగదు చేతికి అందుతుంది.


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


తులా రాశి
తులా రాశి వారికి నేడు ఖర్చులు అధికం కానున్నాయి. మీ చుట్టుపక్కల ఉన్నవారు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పదేపదే అంటారు. కొందరు మిమ్మల్ని సలహా కూడా అడగవచ్చు. వారితో నిజాయితీగా ఉండాలని మరియు వారికి సహాయం చేయాలని భావిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.


వృశ్చిక రాశి
మీరు ఈ రోజు సొంతంగా ప్రేరణ పొందుతారు. గతంలో మీరు నిలిపివేసిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. మీకు పనులు చేయగల శక్తి మరియు మానసిక స్థితి ఉంటుంది. అయితే ఇంట్లో కూర్చుని సమయం వృథా చేయవద్దు. మీరు చేయవలసిన పనుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రాధాన్యత అనుసరించి పూర్తి చేసుకోవాలి. కొన్ని ప్రయాణాల కారణంగా వివాదాలు జరగవచ్చు. ఖర్చులు భారం కానున్నాయి. 


ధనుస్సు రాశి
ఈ రోజు మీ కోసం కొంత సమయం కేటాయించండి. మీరు సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టిసారిస్తారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఈ రోజు ధ్యానం చేయండి. మీకు ఒంటరిగా ఉండటం నచ్చకపోవచ్చు, కానీ ఈ రోజు కొన్ని విషయాలు ఆలోచించేందుకు ఒంటరితనాన్ని కోరుకుంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.


మకర రాశి
ఎవరైనా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని, స్థిరత్వం ప్రదర్శించాలని మీరు భావిస్తారు. అయితే, ప్రతి ఒక్కరికీ మార్పు అవసరం. ఈ రోజు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి ప్రయత్నించండి. స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని ఆహ్వానాలు అందడంతో శుభకార్యాలలో పాల్గొంటారు.


కుంభ రాశి
ఈరోజు కుంభ రాశివారు చాలా సరదాగా, ఉల్లాసంగా గడపనున్నారు. నేడు మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి బయటకు వెళ్లి కొత్త పనులు చేయనున్నారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. దైవదర్శనాలు చేసుకోవాలని భావిస్తారు.


మీన రాశి
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలని అనుకోవచ్చు. మీరు మెదడుతో ఆలోచించే బదులు మనస్సుతో ఆలోచించండి. కొన్ని విషయాల కారణంగా భావోద్వేగానికి లోనవుతారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook