Horoscope Today: ఈ రాశుల వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి..
Horoscope Telugu: ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.
Horoscope prediction today: నేడు ఆదివారం (డిసెంబర్ 12). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 12 (ఆదివారం)
సూర్యోదయం ఉదయం 6:24 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:23 గంటలకు
తిథి- నవమి రాత్రి 8:05 గంటల వరకు
రాహుకాలం: సాయంత్రం 04:07 గంటల నుంచి 05:25 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4:02 గంటల నుంచి 04:43 గంటల వరకు
యమగండము: మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:32 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఒత్తిడి పెరుగే అవకాశాలున్నాయి. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండటం మీకు కలిసి వస్తుంది. విభేదాలకు తావివ్వకండి. నిందలు పడొచ్చు జాగ్రత్త. జీవిత భాగస్వామితో సంసార జీవనం సానుకూలంగా ఉంది.
వృషభ రాశి (Taurus)
మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఆర్థికంగా సానుకూలంగా ఉంది. ఏదైనా పనులు మొదలు పెడితే.. అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో గోడవలకు తావివ్వకండి.
మిథున రాశి (Gemini)
లౌక్యంతో వ్యవహరించాల్సిన సమయమిది. మిమ్మల్ని వెంటాడుతున్న పలు సమస్యలు, సందేహాలకు పరిష్కారం లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి వల్లన కాస్త ఇబ్బంది పడే అకాశాలున్నాయి.
కర్కాటక రాశి (Cancer)
ఇతరుల మాట్లు గుడ్డిగా నమ్మకూడదు. అదే జరిగితే ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీ నైపుణ్యాన్ని నిరూపించుకునే సమయం ఇది. మీ ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. అయితే అందుకోసం శ్రమ పెరిగే అవకాశముంది. వైవాహిక జీవితంలో నేడు శుభదినం కానుంది.
సింహ రాశి (Leo)
ఖర్చులు పెరిగే అవకాశముంది. అనుకోని అతిథి ఇంటికి రావచ్చు. దీని వల్ల మీ పనులు పెండింగ్ పడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి సానుకూల సమయం నడుస్తోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్యా రాశి (Virgo)
ఓ శుభవార్త వింటారు. అర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అన్ని రంగాల వారికి సానుకూల సమయం నడుస్తోంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితంలో అంతా మంచి సమయం నడుస్తోంది. బిజీ సమయంలో మీ కోసం మీరు సమయం కేటాయించుకోవాలి.
తులా రాశి (Libra)
ఈ రాశివారికి నేడు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు నిరాశ కలిగించే విషయాలు జరగొచ్చు. అనవసర విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. అనవసర టెన్షన్లు పక్కన పెట్టి.. ఏదైనా పనులు ప్రారంభిస్తే అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
మీపై మీకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మీ అవసరానికి బంధు, మిత్రుల సహకారం అందుతుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులు సహారం అందిస్తారు. వైవాహిక జీవితంలోనూ సానుకూలంగా ఉంది. కుటుంబంతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ధన యోగం ఉంది. పెరిగిన ఖర్చుల వల్ల మీకు వచ్చిన లాభాలను ఆస్వాధించలేకపోతారు. గడ్డు పరిస్థితులు వస్తే.. మీ స్నేహితులు అండగా నిలిస్తారు. పనున్లో జాప్యం చేయొద్దు. పనలులు ప్రారంభించే ముందు ఆచి తూచి వ్యవహరించాలి. వైవాహిక జీవితం అంత సాఫీగా ఉండకపోవచ్చు.
మకర రాశి (Capricorn)
ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్లాన్ ఉంటే ఇంట్లోని వస్తువులను జాగ్రత్త చేసి వెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త పరిచయాలు స్నేహంగా మారొచ్చు. స్నేహితులు మీకు సపోర్ట్‌గా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆచి తూచి వ్యవహరించాలి. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశముంది. వైవాహిక జీవితం సానుకూలంగానే ఉంది.
కుంభ రాశి (Aquarius)
ఆహ్లాదంగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్తారు. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామికి పనిలి సహకరించేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో కష్టకాలం నడవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.
మీన రాశి (Pices)
అనవసరంగా సమయాన్ని వృధా చేయొద్దు. ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగొచ్చు. ఎక్కు సమయం స్నేహితులతో లేదా బంధు మిత్రులతో గడిపేందుకు ప్రయత్నించండి. ఒ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు రావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook