West Godavari Attili Subramanya Swamy Shasti 2021 festival starts tomorrow history and significance of Swamy Shasti festival: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) అత్తిలిలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీవల్లీ దేవసేన (Srivalli Devasena)సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి (Subrahmanyeshwaraswamy) ప్రతి సంవత్సరం ఎంతో అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, అలాగే నాగదోషం ఉన్న వారు స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా చేస్తే తమ సమస్యలు పోతాయని భక్తుల నమ్మకం. ఎన్నో ప్రత్యేకతలున్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు (Attili Sashti celebrations) శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ఈ ఉత్సవాలకు ప్రతి ఏటా వేలాది మంది తరలివస్తారు.
రేపటి నుంచి అంటే డిసెంబరు 8 నుంచి అత్తిలిలో షష్ఠి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అత్తిలిలో ఏటా సాగే ఈ షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికి పైగానే చరిత్ర ఉంది. పూర్వం అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలో కోనేటి వద్ద ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గర భక్తులు పూజలు నిర్వహించారు. అక్కడే ఒక ఏకశిలపై శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి (Subramanya Swamy) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది 1910లో జరిగింది. ఇక అప్పటి నుంచి ఏటా మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామి వారి కల్యాణం అలాగే షష్ఠిన తీర్థం నిర్వహించేవారు. ఇక 1929వ సంవత్సరంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని అప్పట్లో భారతదేశ మొదటి రాష్ట్రపతి అయిన బాబూరాజేంద్రప్రసాద్ (Baburajendra Prasad) సందర్శించారు.
ఇక క్రమంగా ఆలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి. భక్తులందరికీ అత్తిలి సుబ్రహ్మణ్య స్వామిపై ప్రత్యేక విశ్వాసం ఏర్పడింది. అలాగే ఆలయ కమిటీ కూడా పలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంది. అత్తిలిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరు మీద ఆలయ కమిటీ సహకారంతో నెలకొల్పారు. ఇక షష్ఠి ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లోన్ని ప్రముఖుల్ని సన్మానిస్తుంటారు. ఎస్వీ రంగారావు (SV Rangarao), రేలంగి, రాజనాల, అల్లు రామలింగయ్య, కృష్ణ, చిరంజీవి (Chiranjeevi), శ్రీహరి, బ్రహ్మానందం,ఇలా ఎంతో మంది తెలుగు సినీ నటులను సన్మానించారు.అత్తిలిలో షష్ఠి ఉత్సవాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యమైనది.. సంతానం లేక బాధపడుతూ ఇక్కడికి వచ్చే స్త్రీలకు తర్వాత సంతాన ప్రాప్తి కలగడం.
ముఖ్యంగా షష్ఠి కల్యాణం రాత్రి సంతానం లేని మహిళలు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని.. తర్వాత నాగుల చీర కట్టుకుని.. అక్కడే ముడుపులు కడతారు. ఆలయం వెనుక భాగంలో కొంతసేపు నిద్రిస్తారు. ఇక సంతానం కలిగాక, పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
Also Read : Prabhas: సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ భారీ విరాళం-వదర బాధితులను ఆదుకునేందుకు...
సుబ్రహ్మణ్య స్వామివారి (Subramanya Swamy) ఆలయంలోకి రోజూ సాయంత్రం సోమసూత్రం గుండా ఒక సర్పం గర్భగుడిలోకి వస్తుందని.. మరుసటి రోజు ఉదయం ఆ సర్పం బయటకు వెళ్తుందని అంటారు. ఇక ఈ ఏడాది షష్ఠి మహోత్సవాలు డిసెంబరు 8వ తేదీ నుంచి డిసెంబరు 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
8వ తేదీ సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 9న షష్ఠి మహోత్సవం (Shasti Festival) ఉంటుంది. ఉత్సవాలు జరిగినన్ని రోజులు కళావేదికపై రోజూ రాత్రి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరోనా (Corona) నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు సాగనున్నాయి.
Also Read : Fire Panipuri: ఫైర్‌పాన్ కాదిప్పుడు...ఫైర్ పానీపూరీ కొత్త ట్రెండ్స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook