Horoscope 2022 January 12: ఈ రాశి వారికి గడ్డు కాలం నడుస్తోంది జాగ్రత్త..
నేడు బుధవారం (జనవరి 12). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Horoscope 2022 January 12 : నేడు బుధవారం (జనవరి 12). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2022 జనవరి, 12 (బుధవారం)
సూర్యోదయం ఉదయం 6:37 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:39 గంటలకు
తిథి- పుష్య శుద్ధ దశమి. ఏకాదశి
రాహుకాలం: మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.42 గంటల నుంచి 9.26 గంటల వరకు
యమగండము: ఉదయం 07:30 గంటల నుంచి 9:00 గంటల వరకు
అమృత ఘడియలు: ఉదయం 10.33 గంటల నుంచి మధ్యాహ్నం 12.17 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఈ రాశి వారికి కాస్త గడ్డుకాలం నడుస్తోంది. తోబుట్టువులతో వివాదాలు, కుటుంబ జీవితంలో అస్థిరతను వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ప్రేమ సంబంధాలు అలాగే ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. కొత్త పనులు మొదలు పెట్టే అవకాశముంది.
వృషభ రాశి (Taurus)
పని ప్రదేశంలో కొత్త కొత్త ప్రణాళికల కారణంగా మీరు ఎక్కువ సమయం బిజీగా ఉంటారు. అనివర్య కారణాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు పునర్ ప్రారంభిస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందవచ్చు. కొందరికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ కూడా కావచ్చు.
మిథున రాశి (Gemini)
మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందుతారు. అవకాశాలను సకాలంలో పూర్తిగా ఉపయోగించుకుంటే, మీ వృత్తిపరమైన జీవితం భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనాలను తెచ్చి పెడుతుంది.
కర్కాటక రాశి (Cancer)
విశ్వాసం, ధైర్యం గరిష్ట ఇంకా బలపడతాయి. రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల రంగాల వ్యక్తులు.. సమావేశాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. మీ స్థాయికి తగ్గ గౌరవాన్ని పొందుతారు. కొన్ని కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఓ కఠినమైన సమస్యకు పరిష్కారాలను కనుగొంటారు.
సింహ రాశి (Leo)
మీకు ఆరోగ్యం అనుకూలిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త కొనుగోళ్లు జరిపే అవకాశముంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి.
కన్యా రాశి (Virgo)
ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టే అవకాశముంది. కొత్త అసోసియేషన్ లేదా భాగస్వామ్యంలో చెతులు కలిపే అవకాశాలున్నాయి. వ్యాపారులు తమ ప్రాజెక్ట్‌లలో ఉత్సాహంగా, నమ్మకంగా ముందుకు సాగుతారు. ప్రస్తుతం మీ ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి విజయాన్ని అందిస్తాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశముంది.
తుల రాశి (Libra)
వ్యాపారులకు కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. పనికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం మీ పనితనాన్ని మెరుగు పరుస్తుంది. మానసికంగా మరింత దృఢంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారు వృత్తిపరమైన రంగంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారలు కొత్త ఒప్పందాల ద్వారా మంచి లాభం పొందవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారు నేడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలకు తావివ్వకండి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులు మీ బలహీనతను తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదముంది. అయితే ఈ క్లిష్ట సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సహకారం లభిస్తుంది.
మకర రాశి (Capricorn)
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, వ్యాపారాల విస్తరణ ప్రణాళికను అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. పనికి సంబంధించిన దూరపు ప్రయాణాలు.. రాబోయే నెలల్లో సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీ శ్రమకు మంచి గుర్తిం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు శుభవార్త వింటారు. బంధు మిత్రులతో ఆనదంగా గడుపుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి అనుకూల సమయం నడుస్తోంది. అయితే ఇబ్బంది పెట్టే వారున్నారు జాగ్రత్త. పరిస్థితులు మిమ్మల్ని మానసిక గందరగోళానికి గురి చేస్తాయి. ఈ సమయంలో మీ ప్లాన్స్ ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం. నిరుద్యోగులకు అవకాశాల పెరగొచ్చు. వాహన కొనుగోలుకు అవకాశముంది.
మీన రాశి (Pices)
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అనవసర విషయాల్లో సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. మీ నిర్ణయాలపై తగిన శ్రద్ధ వహించండి. పెట్టబడుల విషయంలో నిపుణుల సలహాతో మాత్రమే ముందుకు సాగాలి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశముంది.
Also read: Makar Sakranti 2022: తెలుగువారు 'సంక్రాంతి' పండుగను ఎందుకు జరుపుకుంటారు?
Also read: Bhogi 2022: భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook