Bhogi Festival 2022: భోగి పండుగ ప్రాముఖ్యత & విశిష్టత గురించి తెలుసుకుందామా...!

Bhogi festival: సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 08:59 AM IST
Bhogi Festival 2022: భోగి పండుగ ప్రాముఖ్యత & విశిష్టత గురించి తెలుసుకుందామా...!

Bhogi festival: 'సంక్రాంతి' వచ్చిందంటే చాలు..తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటాయి. తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' (Sankranthi festival). ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు 'భోగి' పండుగను (Bhogi festival) జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 13న జరుపుకునేందుకు తెలుగువారు రెడీ అయ్యారు. 

'భగ' అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల (bonfire) రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు. అందరూ భోగి రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవుపేడతో తయారైన పిడకలు, ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేస్తారు. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. భోగి అనగానే చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోస్తారు. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి. 

Also Read: Hanuman Photo Vastu: హనుమాన్ ప్రతిమ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికే అరిష్టం!

ఆ గ్రామాల్లో భోగి చేసుకోరు.. 

అందరూ ఒక్కచోట చేరి చేసుకునే ఈ భోగి పండుగకు కొన్ని పల్లెలు దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని (Vijayanagar District) పలు గ్రామాల్లో ఈ పండుగను జరుపుకోవడం లేదు. ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని వదులుకోలేమని స్థానికులు అంటున్నారు. ఈనాటి పిల్లలకు కొందరికైతే భోగి పండుగ గురించి కూడా తెలియదు. దశాబ్దాల కిందట ఏదో జరిగిందనే కారణంతో ఈనాటికి భోగి పండుగకు దూరంగా ఉండటం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Linkhttps://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News